త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay Rashmika | కొడ‌వ సంప్ర‌దాయంలో విజ‌య్‌, ర‌ష్మిక రిసెప్ష‌న్ – పెళ్లైన నెల త‌ర్వాత వేడుక‌లు

పెళ్లైన నెల రోజుల త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న కొడ‌వ సంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో త‌మ రిసెప్ష‌న్ వేడుక‌ను జ‌రుపుకున్నారు. ర‌ష్మిక పుట్టిపెరిగిన విరాజ్‌పేట‌లో సోమ‌వారం ఈ సెల‌బ్రేష‌న్స్ జ‌రిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైర‌ల్ అవుతోన్నాయి.

N

Entertainment | Published On Apr 7, 2026, 3.11 pm IST

Vijay Rashmika | కొడ‌వ సంప్ర‌దాయంలో విజ‌య్‌, ర‌ష్మిక రిసెప్ష‌న్ – పెళ్లైన నెల త‌ర్వాత వేడుక‌లు
Advertisement

Vijay Rashmika | టాలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న ఇటీవ‌లే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ఫిబ్ర‌వ‌రి 26న రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో విరోష్ పెళ్లి వైభ‌వంగా జ‌రిగింది. హిందూ సంప్ర‌దాయంతో పాటు కొడ‌వ ప‌ద్ద‌తిలో ఈ జంట వివాహం చేసుకున్నారు. పెళ్లి మాత్ర‌మే కాకుండా రిసెప్ష‌న్‌ను కూడా రెండు ప‌ద్ద‌తుల్లో జ‌రుపుకున్నారు. పెళ్లైన నెల రోజుల త‌ర్వాత కొడ‌వ సంప్ర‌దాయం ప్ర‌కారం విజ‌య్‌, ర‌ష్మిక రిసెప్ష‌న్ వేడుక జ‌రిగింది.

ర‌ష్మిక పుట్టిన ఊరిలో...

ర‌ష్మిక పుట్టి పెరిగిన కొడ‌గు జిల్లా విరాజ్‌పేట‌లో సోమ‌వారం కొడ‌వ ప‌ద్ద‌తిలో వెడ్డింగ్‌ సెల‌బ్రేష‌న్స్ జ‌రిగాయి. వీరి రిసెప్ష‌న్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. ఈ రిసెప్ష‌న్‌లో విజ‌య్‌, ర‌ష్మిక కొడ‌వ సంప్ర‌దాయ దుస్తుల్లో మెరిశారు. పింక్, ఆలివ్ గ్రీన్ రంగులు క‌ల‌గ‌ల‌సిన చీర‌లో అచ్చు కొడ‌వ అమ్మాయిల త‌యారై ర‌ష్మిక క‌నిపించింది. ట్రెడిష‌న‌ల్ అభ‌ర‌ణాలు ధ‌రించింది. విజ‌య్ కూడా బ్లాక్ బ్లేజ‌ర్‌, వైట్ ష‌ర్ట్ ధ‌రించి క‌నిపించారు. ఒక‌రి చేతిని మ‌రొక‌రు ప‌ట్టుకొని చిరున‌వ్వులు చిందిస్తూ విజ‌య్‌, ర‌ష్మిక ఫంక్ష‌న్ హాల్‌లోకి ఎంట‌ర‌వుతున్న వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

బ‌ర్త్‌డే త‌ర్వాత‌...

విరాజ్‌పేట‌లోని సెరినిటీ క‌న్వెన్ష‌న్‌ హాల్‌లో జ‌రిగిన ఈ వేడుక‌లో విజ‌య్‌, ర‌ష్మిక కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు అతి కొద్ది మంది స‌న్నిహితులు మాత్ర‌మే పాల్గొన్నార‌ట‌. ఏప్రిల్ 5న ర‌ష్మిక మంద‌న్న త‌న 30వ పుట్టిన‌రోజును జ‌రుపుకుంది. ఆ త‌ర్వాత రోజే కొడ‌వ రిసెప్ష‌న్ వేడుక‌తో అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేశారు. . సంప్ర‌దాయాల‌కు విజ‌య్, ర‌ష్మిక ఇచ్చే విలువ‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పెళ్లి త‌ర్వాత కూడా విజ‌య్ పుట్టిన ఊరిలో జంట‌గా స‌త్య‌నారాయ‌ణ స్వామి వ్ర‌తం జ‌రుపుకున్నారు.

ర‌ణ‌బాలితో మూడోసారి...

ప్ర‌స్తుతం విజ‌య్‌, ర‌ష్మిక క‌లిసి ర‌ణ‌బాలి సినిమా చేస్తున్నారు. హిస్టారిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌లే అనంత‌పూర్‌లో పూర్త‌యిన లేటెస్ట్ షెడ్యూల్‌లో విజ‌య్‌, ర‌ష్మిక‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు డైరెక్ట‌ర్ రాహుల్ సాంకృత్యాన్‌. గీత‌గోవిందం, డియ‌ర్ కామ్రేడ్ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూడో సినిమా ఇది.

 

Advertisement
Advertisement