త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay Devarakonda | సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన విజయ్ దేవరకొండ.. వివాహానికి ఆహ్వానం!

G

Movies | Published On Feb 15, 2026, 9.24 am IST

Vijay Devarakonda | సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన విజయ్ దేవరకొండ.. వివాహానికి ఆహ్వానం!
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Devarakonda) సీఎం రేవంత్ రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. త‌న పెండ్లి రావాల్సిందిగా ముఖ్య‌మంత్రికి స్వ‌యంగా ఆహ్వాన పత్రిక అందజేశారు. హైద‌ర‌బాద్ బంజారాహిల్స్‌లోని నివాసంలో సీఎం క‌లిసిన విజ‌య్‌.. త‌న వివాహ వేడుక‌కు రావాల‌ని కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన రేవంత్‌, కాబోయే దంప‌తుల‌కు ముంద‌స్తు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

చాలా కాలంగా ప్రేమ‌లో ఉన్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న త్వ‌ర‌లో పెండ్లి పీట‌లు ఎక్క‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నెల 26న రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో ఉన్న ఓ ప్యాలెస్‌లో వీరి వివాహం జ‌రుగ‌నుంది. కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో ఈ వేడుక నిర్వ‌హించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే సీఎం రేవంత్‌తో భేటీ అయిన విజ‌య్‌.. త‌న వివాహానికి ఆహ్వానించారు. కాగా, మార్చి 4న‌ హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తున్న‌ది.

Advertisement

తాజావార్తలు

Advertisement