Vijay Antony | సినిమా ప్రమోషన్స్ కోసం రోడ్ సైడ్ హోటల్‌లో మిర్చి బజ్జీలు వేసిన హీరో
నాన్న కుట్టి ప్రమోషన్స్ కోసం హీరోయిన్ విజయ్ ఆంటోనీ హైదరాబాద్‌లో రైడ్‌సైడ్ ఉన్న హోటల్‌లో మిర్చీ బజ్జీలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. నాన్న కుట్టి మూవీ నవంబర్ 27న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో ప్రీతి అస్రానీ హీరోయిన్‌గా నటించింది.
Entertainment | Published On Nov 23, 2026, 6.44 pm IST
Vijay Antony | సినిమా తీయడం ఈజీనే...కానీ దానిని జనాల్లోకి తీసుకెళ్లడమే కష్టంగా మారింది. ఆడియెన్స్‌లో సినిమా పట్ల ఆసక్తిని రేకెత్తించేందుకు మేకర్స్ వెరైటీ ప్రమోషన్స్ చేస్తుంటారు. ప్రమోషన్స్ ఎంత భిన్నంగా ఉంటే సినిమా అంత త్వరగా ఆడియెన్స్‌కు రీచ్ అవుతుంది.
అప్పాకుట్టీ...
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రోడ్ సైడ్ హోటల్‌లో బజ్జీలు వేశారు. విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన తమిళ మూవీ అప్పాకుట్టీ గత వారం థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా నాన్నకుట్టి పేరుతో తెలుగులోకి డబ్ అవుతోంది. తెలుగు వెర్షన్ నవంబర్ 27న రిలీజ్ కాబోతుంది.
హైదరాబాద్‌లోని హోటల్‌లో...
తెలుగు ప్రమోషన్స్ కోసం విజయ్ ఆంటోనీ సోమవారం హైదరాబాద్ వచ్చారు. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్ వీధుల్లో తిరుగుతూ తన సినిమా గురించి అభిమానులతో ముచ్చటించారు. అంతటితో ఆగకుండా రోడ్ పక్కన కనిపించిన ఓ హోటల్‌లో మిర్చి బజ్జీలు చేశారు. ఆ హోటల్‌కు బజ్జీలు తినడానికి వచ్చిన కస్టమర్లకు అందజేశాడు. హోటల్‌లో విజయ్ ఆంటోనీ బజ్జీలు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్ ప్రమోషన్స్‌లో విజయ్ ఆంటోనీతో పాటు హీరోయిన్ ప్రీతి అస్రానీ కూడా పాల్గొన్నది. అప్పాకుట్టిని జనాల్లోకి తీసుకెళ్లడానికి గతం వారం ట్రైన్‌లో జనరల్ భోగీలో ప్రయాణం చేశారు విజయ్ ఆంటోనీ.
ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్...
తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు మూ మారన్ దర్శకత్వం వహించారు. ఇందులో తన కూతురిని కాపాడుకోవడానికి తపనపడే సూర్య అనే తండ్రి పాత్రలో విజయ్ ఆంటోనీ నటనకు ప్రశంసలు వస్తున్నాయి. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్‌లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. నాన్న కుట్టి సినిమాను విజయ్ ఆంటోనీ స్వయంగా నిర్మించారు.
@vijayantony garu preparing Bajjis along with @PreethiOffl
#NannaKutty on Nov 27th
#VijayAntony #PreethiAsrani https://t.co/pqrO80fRRH
— Sai Satish (@PROSaiSatish) November 23, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Raashi Khanna | ఓ వైపు సినిమా - మరోవైపు వెబ్‌సిరీస్ - బ్రేక్ లేకుండా కష్టపడుతోన్న రాశీఖన్నా
- ●Bromate in Packaged Drinking Water | మనం తాగే మినరల్ వాటర్ బాటిళ్లలో క్యాన్సర్ కారక రసాయనాలా? అసలు బిస్లెరీ వివాదం ఏంటి?
- ●RERA | ఇందిరమ్మ టవర్స్ ప్రాజెక్టులకు రేరా అనుమతులు
- ●Google Trends India 2026 | ఆరోగ్యం, విహారయాత్రలపై భారతీయులకు పెరుగుతున్న ఆసక్తి.. గూగుల్ సెర్చ్‌లో ట్రెండింగ్ ఇవే..
- ●CM Revanth Reddy | కృష్ణా నుంచి ఆంధ్రకు ప్రతిరోజూ 13 టీఎంసీలు
- ●Srinath Maganti | విడుదలకు ముందు ట్రోలింగ్ - ఇప్పుడు ప్రశంసలు

Raashi Khanna | ఓ వైపు సినిమా - మరోవైపు వెబ్‌సిరీస్ - బ్రేక్ లేకుండా కష్టపడుతోన్న రాశీఖన్నా

Bromate in Packaged Drinking Water | మనం తాగే మినరల్ వాటర్ బాటిళ్లలో క్యాన్సర్ కారక రసాయనాలా? అసలు బిస్లెరీ వివాదం ఏంటి?

RERA | ఇందిరమ్మ టవర్స్ ప్రాజెక్టులకు రేరా అనుమతులు

Google Trends India 2026 | ఆరోగ్యం, విహారయాత్రలపై భారతీయులకు పెరుగుతున్న ఆసక్తి.. గూగుల్ సెర్చ్‌లో ట్రెండింగ్ ఇవే..





