Bollywood | పాకిస్థాన్ క్రికెట్ లీగ్‌లో బాలీవుడ్ ప్రొడ్యూసర్ కొడుకు – నెటిజన్ల ట్రోలింగ్
బాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ విధు వినోద్ చోప్రా తనయుడు అగ్నిదేవ్ చోప్రా పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 సీజన్ కోసం తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో గత ఏడాది వరకు మిజోరాం టీమ్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు పాకిస్థాన్ క్రికెట్ లీగ్ ఆడాలని నిర్ణయించుకోవడం ఆసక్తికరంగా మారింది.
Entertainment | Published On Feb 7, 2026, 8.41 pm IST
Bollywood | ఇండియా, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం క్రికెట్‌పై కూడా పడింది. వరల్డ్ కప్ మినహా ఇండియా, పాకిస్థాన్ మధ్య క్రికెట్ టోర్నీలు జరిగి చాలా కాలమే అయ్యింది. ఆసియా కప్‌లో పాకిస్థాన్ ప్లేయర్లకు ఇండియన్ క్రికెటర్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.ప్రస్తుతం జరుగుతోన్న టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా రద్దు అయినట్లు ప్రచారం జరుగుతోంది. అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే కాకుండా ఐపీఎల్‌లోనూ ఆడకుండా పాకిస్థాన్‌పై ప్లేయర్లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఐపీఎల్‌కు పోటీగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పాకిస్థాన్ సూపర్ లీగ్‌ను ప్రారంభించింది. ఈ లీగ్‌లో ఇండియన్ ప్లేయర్లు ఎవరూ ఆడటం లేదు.
బాలీవుడ్ ప్రొడ్యూసర్ కొడుకు....
తాజాగా పాకిస్థాన్ సూపర్ లీగ్ వేలం కోసం ఓ బాలీవుడ్ ప్రొడ్యూసర్ కొడుకు తన పేరును రిజిస్టర్ చేసుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రీ ఇడియన్స్, పీకే, సంజుతో పాటు బాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన విధు వినోద్ చోప్రా తనయుడు అగ్నిదేవ్ చోప్రా పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 కోసం తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. ఇండియా నుంచి కాకుండా అమెరికా తరఫున పాకిస్థాన్ లీగ్ వేలంలో అగ్నిదేవ్ పోటీపడబోతున్నారు. అగ్నిదేవ్ పేరు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెబ్‌సైట్‌లో కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
రంజీ ట్రోఫీ...
ఆల్‌రౌండర్ అయిన అగ్నిదేవ్ మిజోరాం టీమ్ తరఫున గత ఏడాది వరకు డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు. రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీతో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలలో రాణించాడు. 2023- 24 రంజీ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా మాధవరావు సింధియా అవార్డును అందుకున్నారు.
భారత పౌరసత్వం ఉన్నవారు మాత్రమే డొమెస్టిక్ క్రికెట్‌తో పాటు జాతీయ జట్టు తరఫున ఆడాలంటూ ఇటీవల బీసీసీఐ మార్పులు చేసింది. అగ్నిదేవ్ అమెరికన్ సిటిజన్ కావడంతో దేశవాళీ క్రికెట్ ఆడటం అడ్డంకిగా మారింది. అందుకే ఫారిన్ లీగ్‌లలో ఆడాలని నిర్ణయించుకున్న అతడు పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో తన పేరును రిజిస్టర్ చేసుకున్నట్లు చెబుతున్నారు. పాకిస్థాన్ కరెన్సీలు ఆరు లక్షలు (ఇండియాలో 19 లక్షల ) బేస్ ప్రైజ్‌తో అగ్నిదేవ్ వేలంలో పోటీపడబోతున్నాడు. అగ్నిదేవ్ పాకిస్థాన్ క్రికెట్ లీగ్‌లో ఆడాలని నిర్ణయించుకోవడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



