Trisha | ఎనిమిదేళ్ల తర్వాత హారర్ మూవీలో త్రిష – పొలిటికల్ ఎంట్రీ రూమర్లకు చెన్నై క్వీన్ చెక్
తమిళనాడు పాలిటిక్స్‌లో గత కొద్ది రోజులుగా త్రిష పేరు ఎక్కువగా వినిపిస్తోంది. చెన్నై క్వీన్ సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. దళపతి విజయ్ టీవీకే పార్టీలో త్రిష చేరనున్నట్లు వార్తలొస్తున్నాయి. అందుకే కొత్త సినిమాలను అంగీకరించడం లేదంటూ వార్తలు వస్తున్నాయి.
Naresh N
Entertainment | Published On Sep 3, 2026, 7.19 pm IST

పొలిటికల్ రూమర్లకు వెరైటీగా త్రిష చెక్ పెట్టింది. ఓ కొత్త సినిమాకు గ్రీన్‌సిగ్నల్ సిగ్నల్ ఇచ్చింది.

త్రిష హీరోయిన్‌గా తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ లండన్‌లో ప్రారంభమైంది. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ రాజా కృష్ణ మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు.

దాదాపు ఎనిమిదేళ్ల రాజా కృష్ణ మీనన్ మూవీతో హారర్ జానర్‌ను టచ్ చేస్తోంది త్రిష. ఇందులో రాధికా శరత్‌కుమార్, అపర్ణ బాలమురళి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

కరుప్పు బ్లాక్‌బస్టర్ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలను రిజెక్ట్ చేసిన త్రిష హారర్ మూవీని అంగీకరించడం ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం తెలుగులో చిరంజీవి విశ్వంభరలో హీరోయిన్‌గా నటిస్తోంది. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ సమస్యల కారణంగా చాలా కాలంగా సినిమా రిలీజ్ వాయిదాపడుతూ వస్తోంది.
తాజావార్తలు
- ●Gadwal Vijayalakshmi | సీఎం రేవంత్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా : గద్వాల్ విజయలక్ష్మి
- ●Chanchalguda to Santoshnagar Flyover | పాతబస్తీ ట్రాఫిక్ కష్టాలకు చెక్: చంచల్‌గూడ - సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్
- ●BJP Malka Komaraiah | ఫీజులు అడిగితే అరెస్టులు చేస్తారా? విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు
- ●Konda Surekha - Chinna Reddy | సురేఖ బర్తరఫ్.. చిన్నారెడ్డి రాజీనామా
- ●KTR | రైతుల కోసం.. కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేస్తా : కేటీఆర్
- ●Dasoju Sravan Press Meet | వైట్ కాలర్ క్రిమినల్ పొంగులేటి.. సీఎం పదవి కొనుక్కున్న రేవంత్

Gadwal Vijayalakshmi | సీఎం రేవంత్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా : గద్వాల్ విజయలక్ష్మి

Chanchalguda to Santoshnagar Flyover | పాతబస్తీ ట్రాఫిక్ కష్టాలకు చెక్: చంచల్‌గూడ - సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్

BJP Malka Komaraiah | ఫీజులు అడిగితే అరెస్టులు చేస్తారా? విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు

Konda Surekha - Chinna Reddy | సురేఖ బర్తరఫ్.. చిన్నారెడ్డి రాజీనామా


