త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trisha Krishnan | త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు.. కూల్‌గా పోస్ట్ పెట్టిన బ్యూటీ..!

Trisha Krishnan | ప్ర‌ముఖ న‌టి త్రిష కృష్ణ‌న్ ఇంటికి ఇటీవ‌ల బాంబు బెదిరింపులు రావ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. గ‌త ఆరునెల‌ల్లో ఇలాంటి బెదిరింపులు రావ‌డం ఇది రెండోసారి కావ‌డం గమనార్హం. ఇటీవ‌ల కొద్ది రోజులుగా ఈ చెన్నై బ్యూటీ వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తోంది. 2025 అక్టోబర్‌లో త్రిష నివాసానికి తొలిసారి బాంబు బెదిరింపు వచ్చింది.

P

Entertainment | Published On Apr 15, 2026, 9.15 am IST

Trisha Krishnan | త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు.. కూల్‌గా పోస్ట్ పెట్టిన బ్యూటీ..!
Advertisement

Trisha Krishnan | ప్ర‌ముఖ న‌టి త్రిష కృష్ణ‌న్ ఇంటికి ఇటీవ‌ల బాంబు బెదిరింపులు రావ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. గ‌త ఆరునెల‌ల్లో ఇలాంటి బెదిరింపులు రావ‌డం ఇది రెండోసారి కావ‌డం గమనార్హం. ఇటీవ‌ల కొద్ది రోజులుగా ఈ చెన్నై బ్యూటీ వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తోంది. 2025 అక్టోబర్‌లో త్రిష నివాసానికి తొలిసారి బాంబు బెదిరింపు వచ్చింది. అయితే ఆ సమయంలో కేవ‌లం త‌ప్పుడు బెదిరింపులుగా తేలింది. తాజాగా తమిళనాడు డీజీపీ కంట్రోల్ రూమ్‌కు మరోసారి ఆమె చెన్నై అల్వార్‌పేట్ నివాసంలో బాంబు పెట్టినట్లుగా స‌మాచారం అందింది. ఈ సమాచారంతో వెంటనే తేనాంపేట్ పోలీసులు అప్రమత్తమై, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో ఆ ప్రాంతాన్ని పూర్తిగా జ‌ల్లెడ‌ప‌ట్టారు. ఈ సారి సైతం ఎలాంటి పేలుడు ప‌దార్థాలు ల‌భించ‌క‌పోవ‌డంతో కేవ‌లం ఫేక్ ఇన్ఫ‌ర్మేష‌న్‌గా పోలీసులు నిర్ధారించారు.

గత కొంతకాలంగా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులకు ఇలాంటి తప్పుడు బాంబు బెదిరింపులు తరచుగా వస్తున్నాయి. గతంలో రజనీకాంత్, ధనుష్ వంటి ప్రముఖులకు చెందిన ఇండ్ల‌ను బాంబుతో పేల్చేస్తామని హెచ్చరిక సందేశాలు వచ్చిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనతో అభిమానులు ఆందోళనకు గురైనప్పటికీ త్రిష మాత్రం ప్రశాంతంగా వ్యవహరించారు. ఆమె తన రోజువారీ జీవితానికి సంబంధించిన క్షణాలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు. ఒక ఫొటోలో బ్లూబెరీస్‌తో కనిపించగా.. మరో ఫొటోలో తన పెంపుడు కుక్క “ఇజ్జీ”తో క‌నిపించింది. సరదాగా చేసిన ఓ పోస్టులో ఆమె కుక్క మెట్లపైకి ఎక్కుతున్న స్టోరీ షేర్ చేస్తూ.. “మా అమ్మ బ్యాగ్‌ను ఎవరూ ముట్టుకోలేరు. నన్ను వెంట తీసుకెళ్తే తప్ప ఆమె కూడా ముట్టుకోలేదు” అని క్యాప్షన్ పెట్టింది. త్రిష తరచుగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇజ్జీ ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. దాంతో బాంబు బెదిరింపుల‌ను తేలిగ్గా తీసుకుందని తెలుస్తోంది.

ఇక త్రిష సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళంలో వ‌రుస సినిమాలు చేస్తోంది. త్రిష చివ‌రిసారిగా థ‌గ్‌లైఫ్ మూవీలో క‌నిపించింది. ప్ర‌స్తుతం త‌మిళంలో క‌రుప్పు మూవీలో న‌టిస్తుంది. తెలుగులో చాలారోజుల త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభ‌ర మూవీలో జ‌త‌క‌డుతోంది. తొలిసారిగా మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ రామ్ మూవీలో కీల‌క‌పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

Advertisement
Advertisement