Trisha | త్రిష మూవీకి స్పెషల్ షోస్ పర్మిషన్ – జీవో జారీ చేసిన దళపతి విజయ్ ప్రభుత్వం
త్రిష కరుప్పు మూవీకి దళపతి విజయ్ టీవీకే ప్రభుత్వం గుడ్‌న్యూస్ వినిపించింది. స్పెషల్ షోస్‌కు పర్మిషన్ ఇస్తూ జీవో జారీ చేసింది. సూర్య హీరోగా నటిస్తున్న ఈ తమిళ మూవీ మే 14న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.
Entertainment | Published On May 12, 2026, 7.06 pm IST
Trisha | ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ బాధ్యతలను చేపట్టారు. విజయ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమిళనాట థియేటర్లలోకి తొలిసారి త్రిష మూవీ రాబోతుంది. సూర్య, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన కరుప్పు మే 14న రిలీజ్ కాబోతుంది. కాగా త్రిష మూవీకి సీఎం విజయ్ గుడ్‌న్యూస్ వినిపించారు.
ఐదు షోస్...
కరుప్పు స్పెషల్ షోస్‌కు తమిళనాట పర్మిషన్ ఇచ్చారు. మే 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు తమిళనాడులోని అన్ని థియేటర్లలో అదనంగా మరో షోను స్క్రీనింగ్ చేసేందుకు అనుమతులు ఇచ్చారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే కరుప్పు స్క్రీనింగ్ మొదలుకాబోతుంది. ఈ స్పెషల్ షోస్‌కు సంబంధించిన జీవోను టీవీకే ప్రభుత్వం జారీ చేసింది.
వారిసు టైమ్‌లో...
విజయ్ వారిసు రిలీజ్ టైమ్‌లో జరిగిన ప్రమాదంలో ఓ అభిమాని మరణించాడు. అప్పటి నుంచి స్పెషల్ షోస్‌ను డీఎంకే ప్రభుత్వం బ్యాన్ చేసింది. టీవీకే అధికారంలోకి వచ్చిన వెంటనే స్పెషల్ షోస్‌పై ఉన్న బ్యాన్‌ను ఎత్తివేయడంతో సినీ లవర్స్ ఖుషీ అవుతున్నారు.
త్రిష మూవీకి విజయ్ అనుమతులు ఇవ్వడం కూడా ఆసక్తికరంగా మారింది. స్పెషల్ షోస్‌కు పర్మిషన్ ఇచ్చిన విజయ్‌కి కరుప్పు నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కృతజ్ఞతలు తెలిపింది.
లాయర్ పాత్రలో...
యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న కరుప్పులో త్రిష లాయర్ పాత్రలో కనిపించబోతున్నది. దాదాపు ఇరవై రెండేళ్ల తర్వాత సూర్య, త్రిష కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా తెలుగులోనూ వీరభద్రుడు పేరుతో రిలీజ్ కాబోతుంది. కరుప్పుకు ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నాడు.
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

CM Vijay | ప్రభుత్వ వాహనాన్ని స్వయంగా నడిపిన సీఎం విజయ్
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



