The Paradise | ‘ది ప్యారడైజ్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్.. రిలీజ్‌కు ముందే రూ.50 కోట్ల దిశగా!
The Paradise | నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఒదెల కాంబోలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ముందస్తు టికెట్ సేల్స్ జోరందుకున్నాయి. తాజాగా అందిన ట్రేడ్ లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.44.09 కోట్ల గ్రాస్ రాబట్టింది.
Entertainment | Published On Sep 23, 2026, 7.36 pm IST
The Paradise | నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఒదెల కాంబోలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ముందస్తు టికెట్ సేల్స్ జోరందుకున్నాయి. తాజాగా అందిన ట్రేడ్ లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.44.09 కోట్ల గ్రాస్ రాబట్టింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు నమోదైన లెక్కలే. షోలు ప్రారంభమయ్యేలోపు ఈ మొత్తం రూ.50 కోట్ల మార్క్‌ను దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో దుమ్మురేపుతున్న బుకింగ్స్
దేశీయంగా ఇప్పటివరకు ‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ సేల్స్ రూ.29.17 కోట్ల గ్రాస్‌కు చేరుకున్నాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా గణనీయంగా ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రీమియర్స్, తొలి రోజు షోలకు సంబంధించి ఇప్పటికే రూ.22.69 కోట్ల గ్రాస్ వసూలైనట్లు సమాచారం. తెలంగాణలో రూ.14.05 కోట్ల గ్రాస్ నమోదైంది. ఇందులో హైదరాబాద్ ఒక్కటే రూ.11.40 కోట్లతో ప్రధాన వాటాను దక్కించుకుంది. ఏపీలో ఇప్పటివరకు రూ.8.64 కోట్ల గ్రాస్ వచ్చింది. నైజాంలో రూ.14.05 కోట్లు, హైదరాబాద్: రూ.11.40 కోట్లు, వైజాగ్‌లో రూ.2.35 కోట్లు, సీడెడ్ రూ.1.49 కోట్లు, తూర్పు గోదావరి రూ.1.28 కోట్లు, గుంటూరు రూ.1.19 కోట్లు, కృష్ణా రూ.1.09 కోట్లు, పశ్చిమ గోదావరి రూ.69.98 లక్షలు, నెల్లూరు రూ.55.42 లక్షలు వచ్చినట్లు తెలుస్తోంది.
ఓవర్సీస్‌లోనూ అదే జోరు
విదేశీ మార్కెట్లలోనూ ‘ది ప్యారడైజ్’కు ముందస్తు బుకింగ్స్ రూపంలో మంచి స్పందన వస్తోంది. ఓవర్సీస్‌లో ఇప్పటివరకు రూ.14.92 కోట్ల గ్రాస్ నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలో అత్యధికంగా 1.16 మిలియన్ డాలర్ల గ్రాస్ రాగా.. యూకేలో 157.2 వేల డాలర్లు, కెనడాలో 104 వేల డాలర్లు, ఆస్ట్రేలియాలో 69.5 వేల డాలర్ల మేర అడ్వాన్స్ సేల్స్ జరిగాయి. ఇక యూఏఈలో 21.5 వేల డాలర్లు, జర్మనీలో 19.4 వేల డాలర్లు, ఐర్లాండ్‌లో 13.8 వేల డాలర్లు, కువైట్‌లో 8.6 వేల డాలర్లు, న్యూజిలాండ్‌లో 3.9 వేల డాలర్ల బుకింగ్స్ నమోదయ్యాయి. ఒమన్, సౌదీ అరేబియా తదితర దేశాల్లోనూ టికెట్ విక్రయాలు కొనసాగుతున్నాయి. మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. నాని, శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్‌పై ఉన్న ఆసక్తి.. సినిమాపై ముందస్తు బుకింగ్స్‌లోనూ కనిపిస్తోందని ట్రేడ్ వర్గాల గణాంకాలు సూచిస్తున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Manasa Varanasi | తొలిసారిగా శర్వానంద్‌తో మానస వారణాసి రొమాన్స్..!
సెప్టెంబర్ 23, 2026

Nayanthara | లేడి సూపర్ స్టార్ అభిమానులకు పండగే..! ఒకే రోజు ఓటీటీలో నయన్ రెండు సినిమాలు..?
సెప్టెంబర్ 23, 2026

Pavithra Gowda | వేధింపులు భరించలేను.. బెయిల్ ఇవ్వకుంటే విషమైనా ఇవ్వండి : పవిత్ర గౌడ
సెప్టెంబర్ 23, 2026
తాజావార్తలు
- ●Supreme Court | ఈసీ నియామకాల చట్టంపై సుప్రీంలో భిన్న తీర్పులు
- ●Teenmar Mallanna BC Rajyadhikara Yatra | కొడంగల్‌లో అడుగుపెడతా.. రేవంత్ రెడ్డి భరతం పడతా
- ●BJP | నెక్స్ట్ తెలంగాణ.. 2028/29 ఎన్నికలపై గురి పెట్టిన బీజేపీ
- ●Devi Prasad | చర్చలు కాదు.. పీఆర్సీ నివేదిక కావాలి : దేవీ ప్రసాద్
- ●Bathukamma Dubai | దుబాయిలోనూ అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు.. ప్రభుత్వానికి ఎన్నారై కమిటీ విజ్ఞప్తి
- ●ఫార్ములా పాతదే.. సౌత్ లెక్క కొత్తది! అరుణకు తమిళనాడు.. కాసంకు కర్ణాటక

Supreme Court | ఈసీ నియామకాల చట్టంపై సుప్రీంలో భిన్న తీర్పులు

Teenmar Mallanna BC Rajyadhikara Yatra | కొడంగల్‌లో అడుగుపెడతా.. రేవంత్ రెడ్డి భరతం పడతా

BJP | నెక్స్ట్ తెలంగాణ.. 2028/29 ఎన్నికలపై గురి పెట్టిన బీజేపీ

Devi Prasad | చర్చలు కాదు.. పీఆర్సీ నివేదిక కావాలి : దేవీ ప్రసాద్



