Tara Sutaria | మళ్లీ వార్తల్లో నిలిచిన బాలీవుడ్ బ్యూటీ తారా సుతారియా..!
Tara Sutaria | బాలీవుడ్ బ్యూటీ తారా సుతారియా మళ్లీ వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ఇటీవల తన ప్రియుడు వీర్ పహారియాతో విడిపోయిన విషయం తెలిసిందే. వ్యక్తిగత జీవితంపై ఎన్నో ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఈ అమ్మడు మాత్రం తన లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నది.
Entertainment | Published On Feb 24, 2026, 1.03 pm IST
Tara Sutaria | బాలీవుడ్ బ్యూటీ తారా సుతారియా మళ్లీ వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ఇటీవల తన ప్రియుడు వీర్ పహారియాతో విడిపోయిన విషయం తెలిసిందే. వ్యక్తిగత జీవితంపై ఎన్నో ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఈ అమ్మడు మాత్రం తన లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నది. తాజాగా ముంబయిలో సొంతింటిని కొనుగోలు చేసి.. జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నది. ఇల్లుకు సంబంధించిన ఫొటోలను పంచుకుంది. ఫొట్లో తారా ఆఫ్-వైట్ రంగు చీరలో మెరిసిపోయింది. సంప్రదాయ బంగారు ఆభరణాలు ధరించి, జడలో మల్లెపూల గజ్రా కట్టుకుని, చిరునవ్వులు చిందించింది. గృహాలంకరణ సైతం ప్రత్యేకంగా నిలిచింది. పాతకాలం పోకడలను తలపించేలా అలంకరించిన ఫర్నిచర్ ఇంటికి ఓ డిఫరెంట్ లుక్‌ను తీసుకువచ్చింది. భారీ పియానో ఆ ఇంటికి మరింత కళాత్మక అందాన్ని జోడించింది. తారా ఫొటోలను చూసిన పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. రియా చక్రవర్తి, దిశా పటానీ, క్రిష్ణ ష్రాఫ్, సోనమ్ బజ్వా, బాద్షాతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల ఈ బ్యూటీ తన ప్రియుడు వీర్ పహారియాతో విడిపోయిన విషయం తెలిసిందే. గతేడాది వీరిద్దరు ప్రేమలో పడ్డారు. జులైలో తమ రిలేషన్‌పై అధికారిక ప్రకటన చేశారు. అయితే, పంజాబీ సింకర్ ఏపీ థిల్లాన్ ముంబయి సంగీత కచేరీ సమయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తిందని, ఆ తర్వాత ఇద్దరు వీడిపోయినట్లుగా ప్రచారం జరిగింది. అయితే, ఇద్దరు తాము విడిపోయామని అధికారికంగా ప్రకటించకపోయినా వీర్ పహారియా జన్మదిన వేడుకలు జరగ్గా.. తారా హాజరుకాకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలోనూ శుభాకాంక్షలు చెప్పకపోవడంతో విడిపోయారన్న వార్తలకు మరింత బలం చేకూరింది. నుపూర్ సనన్, స్టెబిన్ బెన్‌ల పెళ్లి విందుకు కార్యక్రమానికి సైతం విడివిడిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే తారా కొత్త ఇంటిని కొనుగోలు చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కన్నడ హీరో యష్ హీరోగా తెరకెక్కుతున్న మూవీలో నటిస్తున్నది.
View this post on Instagram
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



