Tamil Nadu | ఆరోసారి సీఎంగా సినీ స్టార్..! డీఎంకే, అన్నాడీఎంకేతో సహా 35 పార్టీలను ఓడించిన విజయ్..!
Tamil Nadu | తమిళనాట మరో సినీ నటుడు ముఖ్యమంత్రి అయ్యేందుకు మార్గం సుగమమైంది. ఇది రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఆరోసారి కావడం విశేషం. అసెంబ్లీ ఎన్నికల్లో తళపతి విజయ్ సాధించిన అప్రతిహత విజయం ప్రజాస్వామ్య చరిత్రలో విశేష ఘట్టంగా నిలిచింది. అభిమానాన్ని ఓట్లుగా మలచుకోవడం ఒకవైపు యాదృచ్ఛికంగా కనిపించినప్పటికీ.. మరోవైపు ఇది సమాజంలో మారుతున్న రాజకీయ ధోరణులకు ప్రతీకగా భావిస్తున్నారు.
Entertainment | Published On May 5, 2026, 10.16 am IST
Tamil Nadu | తమిళనాట మరో సినీ నటుడు ముఖ్యమంత్రి అయ్యేందుకు మార్గం సుగమమైంది. ఇది రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఆరోసారి కావడం విశేషం. అసెంబ్లీ ఎన్నికల్లో తళపతి విజయ్ సాధించిన అప్రతిహత విజయం ప్రజాస్వామ్య చరిత్రలో విశేష ఘట్టంగా నిలిచింది. అభిమానాన్ని ఓట్లుగా మలచుకోవడం ఒకవైపు యాదృచ్ఛికంగా కనిపించినప్పటికీ.. మరోవైపు ఇది సమాజంలో మారుతున్న రాజకీయ ధోరణులకు ప్రతీకగా భావిస్తున్నారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు కేవలం పది సీట్ల దూరంలో విజయ్ పార్టీ ఆగిపోయినా.. 108 స్థానాలతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, ఎన్నికల ఫలితాల తర్వాత పలు ప్రశ్నలు తలెత్తున్నాయి. విజయ్ ఈ స్థాయిలో విజయం సాధిస్తాడని ఎవరూ ముందుగా అంచనా వేయలేకపోయారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేతలు, విశ్లేషకులు, ఎగ్జిట్ పోల్స్ సంస్థలు సైతం అందరూ డీఎంకేదే విజయమని చెప్పాయి. యాక్సిస్ ఇండియా సర్వే ఒక్కటి మాత్రమే విజయ్ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. ప్రతి ఓటును విశ్లేషించగలమని చెప్పుకునే రాజకీయ విశ్లేషకులు, సీనియర్ నేతలు ప్రజలు ఇవ్వబోయే తీర్పును ఎందుకు అంచనా వేయలేకపోయారన్నది చర్చనీయాంశంగా మారింది.
35 పార్టీలకు ఒకేసారి ఓటమి..
కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. డీఎంకే–ఏఐఏడీఎంకే పార్టీల మధ్య సుదీర్ఘకాలంగా పోటీ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ద్రావిడ రాజకీయాలు ఈ రెండు పార్టీల చుట్టూ తిరుగుతాయని భావించారు. విజయ్ నిర్వహించిన సభలకు పెద్ద సంఖ్యలు జనం తరలివచ్చారు. అయితే, కేవలం సినిమా స్టార్ హీరోను చూసేందుకు మాత్రమే వచ్చారని, ఓటు బ్యాంకుగా మారే అవకాశం లేదంటూ తేలిగ్గా తీసుకున్నారనే విమర్శలున్నాయి. తన తొలి ఎన్నికల్లోనే రాష్ట్రవ్యాప్తంగా గణనీయ ఫలితాలు సాధించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సినిమా స్టార్ ఎలా ప్రభావవంతమైన రాజకీయ నేతగా ఎదగవచ్చో స్పష్టంగా చూపించాడు. రాజకీయ అనుభవం లేదన్న విమర్శలను ఈ ఫలితాలు పూర్తిగా కొట్టివేశాయి. ఈ విజయాన్ని మాజీ ముఖ్యమంత్రి, నటుడు ఎంజీ రామచంద్రన్ సాధించిన విజయంతో పోలుస్తూ.. ఆయన సాధించిన దాని కంటే ఇది భారీ విజయంగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విజయ్ కేవలం గెలవడమే కాకుండా డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి ప్రధాన పార్టీలతో పాటు మొత్తం 35కిపైగా పార్టీలను ఒకేసారి ఓడించడం గమనార్హం.
ఒకే వేదికపైకి పార్టీలను తీసుకొచ్చినా..
డీఎంకే కూటమి విషయానికొస్తే అనేక పార్టీలను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. చివరకు ఓటర్లు కూటమి ఆకట్టుకోలేకపోయింది. ఈ కూటమికి నిర్మాణం స్పష్టమైన వ్యూహం లేకుండా ఏర్పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు విజయ్ గెలుపుతో పాటు ఎంకే స్టాలిన్‌కు ఎదురైన పరాజయం గుర్తుండి పోతుంది. 2011 నుంచి విజయం సాధిస్తూ వచ్చిన స్టాలిన్ తొలిసారిగా ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. దీంతో ఆయన తమిళనాడు చరిత్రలో తన సొంత నియోజకవర్గంలోనే ఓటమిపాలైన మూడో ముఖ్యంతిగా నిలిచారు. గతంలో జయలలితకు సైతం ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇది కేవలం ముఖ్యమంత్రికే పరిమితం కాకుండా ప్రభుత్వంలోని పలువురు కీలక మంత్రులు ఓటమి చవిచూశారు. కుటుంబాల రాజకీయ వారసత్వాన్ని ఆధారంగా చేసుకుని పోటీ చేసిన పలువురు ప్రముఖులకు సైతం పరాభవం తప్పలేదు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులకు సంకేతంగా భావిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం ఏంటంటే.. తమిళనాడులో చాలాకాలం తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. 2006లో డీఎంకే, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ సమయంలో డీఎంకే 96 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా అలాంటి పరిస్థితి మళ్లీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఇతర పార్టీల మద్దతు కీలకం కానుంది.
విజయ్ గెలుపు వెనుక..
విజయ్ గెలుపు వెనుక ఉన్న ప్రధాన కారణాలను పరిశీలిస్తే.. ఆయన సామాజిక సేవా కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలిచాయి. పార్టీ ఏర్పాటుకు ముందే విజయ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. పేద కుటుంబాలకు అండగా నిలిచారు. బాలికలు చదువుకునేందుకు, పేదల కుటుంబాల్లో పెళ్ళిళ్లకు ఆర్థికంగా సహకారం అందించారు. దాంతో ప్రజల్లో సేవ కార్యక్రమాలు ఆయనపై విశ్వాసాన్ని పెంచాయి. ఈ కారణంగా యువత, మహిళల నుంచి విశేష ఆదరణ లభించింది. ఆయా వర్గాల ఓట్లు విజయ్ గెలుపులో కీలకపాత్ర పోషించాయి. ఇదిలా ఉండగా.. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీ మంచి పనితీరు కనబర్చిందని, ఇప్పుడు ప్రతిపక్షంగా కూడా అదే స్థాయిలో పని చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయం అత్యంత ముఖ్యమన్నారు. ఈ ఫలితాలు తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచాయి. సంప్రదాయ రాజకీయ సమీకరణాలను పటాపంచలు చేసిన ఈ తీర్పు.. భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయ దిశను పూర్తిగా మార్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay TVK Cabinet | తమిళనాడు పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్: 59 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రభుత్వంలోకి కాంగ్రెస్.. సీఎం విజయ్ క్యాబినెట్లో ఇద్దరికి ఛాన్స్
మే 20, 2026

SIR | అర్హులకు ఓటు హక్కు కల్పించడమే సర్ లక్ష్యం : కలెక్టర్ గరిమ అగ్రవాల్
మే 20, 2026

Murder Case | వరంగల్‌లో జంట హత్యల కేసు: నిందితుడికి మరణశిక్ష విధించిన కోర్టు..!
మే 20, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



