త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suniel Narang | ఫిలిం చాంబ‌ర్ ప‌ద‌వికి సునీల్ నారంగ్ రాజీనామా.. ప‌ర్సంటేజీ వివాద‌మే కార‌ణ‌మా..?

Suniel Narang | టాలీవుడ్‌లో ప‌ర్సంటేజీల వివాదం మ‌ధ్య బుధ‌వారం కీల‌క ప‌రిణామం చోటు చేసుకున్న‌ది. తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, ఏషియన్ మల్టీప్లెక్స్‌ల అధినేత సునీల్ నారంగ్ రాజీనామా చేశారు.

P

Entertainment | Published On May 20, 2026, 4.08 pm IST

Suniel Narang | ఫిలిం చాంబ‌ర్ ప‌ద‌వికి సునీల్ నారంగ్ రాజీనామా.. ప‌ర్సంటేజీ వివాద‌మే కార‌ణ‌మా..?
Advertisement

Suniel Narang | టాలీవుడ్‌లో ప‌ర్సంటేజీల వివాదం మ‌ధ్య బుధ‌వారం కీల‌క ప‌రిణామం చోటు చేసుకున్న‌ది. తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, ఏషియన్ మల్టీప్లెక్స్‌ల అధినేత సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవ‌డం ఇండ‌స్ట్రీలో స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొంటూ ఆయన ఫిలిం ఛాంబర్‌కు ఈమెయిల్ ద్వారా తన రాజీనామా లేఖ పంపారు. అత్యవసరంగా సమావేశమైన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆయన రాజీనామాను ఆమోదించింది. అయితే, ఆయ‌న రాజీనామాకు కార‌ణం టాలీవుడ్‌లో కొన‌సాగుతున్న ప‌ర్సంటేజీల విధానానికి సంబంధించి వివాద‌మేన‌ని తెలుస్తోంది.

థియేటర్ల నిర్వహణ వ్య‌యం భారీగా పెర‌గ‌డం, సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో సైతం మల్టీప్లెక్స్‌ల మాదిరిగా కలెక్షన్లలో ప‌ర్సంటేజీ ప‌ద్ద‌తిని అమ‌లు చేయాల‌ని ఎగ్జిబిట‌ర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ విధానాన్ని ప‌లువురు అగ్ర నిర్మాత‌లు వ్య‌తిరేకిస్తున్నారు. ఈ విష‌యంలో ఇండ‌స్ట్రీలో విబభేదాలు పెరుగుతున్న నేప‌థ్యంలో ఎగ్జిబిటర్ల తరఫున బ‌లంగా వాదించిన సునీల్ నారంగ్‌పై నిర్మాతల నుంచి ఒత్తిళ్లు, విమర్శలు ఎదురైనట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న అసంతృప్తికి గురై ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లుగా భావిస్తున్నారు. నారంగ్ రాజీనామాతో ఖాళీ అయిన అధ్యక్ష స్థానాన్ని భర్తీ చేసేందుకు ఫిలిం చాంబర్ చ‌ర్య‌లు ప్రారంభించింది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు గురువారం ప్ర‌త్యేకంగా ఎన్నిక‌లు నిర్వ‌హించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ప్రస్తుతం నిర్మాతలు, థియేటర్ యజమానుల మధ్య నెలకొన్న విభేదాల వేళ కొత్త అధ్యక్షుడిగా ఎవ‌రు బాధ్య‌త‌లు చేప‌డుతారు? ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటారన్నది టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Advertisement
Advertisement