Sreeleela | సీఏం కూతురిగా శ్రీలీల – తెలుగులో నేరుగా ఓటీటీలో రిలీజైన యాక్షన్ డ్రామా మూవీ
శ్రీలీల హీరోయిన్‌గా నటించిన తమిళ మూవీ పరాశక్తి తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. శనివారం (నేడు) నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహించారు.
Entertainment | Published On Feb 7, 2026, 3.23 pm IST
Sreeleela | పరాశక్తి మూవీతోనే హీరోయిన్‌గా శ్రీలీల తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. శివకార్తికేయన్ హీరోగా నేషనల్ అవార్డ్ విన్నర్ సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ క్రిటిక్స్‌ను మెప్పించింది. కమర్షియల్‌గా మాత్రం ఫెయిల్యూర్‌గా నిలిచింది. పరాశక్తి మూవీని తమిళంతో పాటు తెలుగులోనూ థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. తెలుగు వెర్షన్‌కు సంబంధించి ట్రైలర్‌తో పాటు సాంగ్స్ రిలీజ్ చేశారు. సంక్రాంతి బరిలో ఐదు తెలుగు సినిమాలు ఉండటంతో పరాశక్తికి థియేటర్లు దొరకలేదు. దాంతో చివరి నిమిషంలో వాయిదావేశారు. కేవలం తమిళ వెర్షన్ మాత్రమే రిలీజైంది.
నేరుగా ఓటీటీలోకి...
తాజాగా పరాశక్తి మూవీ తెలుగులోకి వచ్చింది. నేరుగా ఓటీటీలోకి రిలీజైంది. జీ5 ఓటీటీలో పరాశక్తి మూవీ శనివారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది.
సూరారైపొట్రు తర్వాత సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన పరాశక్తిపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
100 కోట్ల కలెక్షన్స్...
దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 100 కోట్లలోపే కలెక్షన్స్ రాబట్టింది. నిర్మాతలకు భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. పరాశక్తిలో గ్లామర్ రోల్‌లో కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో శ్రీలీల కనిపించింది. సీఏం కూతురిగా, ఉద్యమకారిణిగా డిఫరెంట్ షేడ్స్‌తో కూడిన పాత్రలో నటించింది. పరాశక్తి మూవీలో తమిళ హీరో జయం రవి విలన్‌గా నటించాడు.
పరాశక్తి కథేమిటంటే?
పురానానూర్‌లో హిందీ వ్యతిరేక ఉద్యమం ఉదృథంగా సాగుతుంటుంది. ఈ పోరాటానికి చిన్నదురై నాయకత్వం వహిస్తాడు. చిన్నదురై అన్నయ్య చెజియన్ మాత్రం ఈ గొడవలకు దూరంగా ఉంటాడు. ఈ ఉద్యమాన్ని అణిచివేసే బాధ్యతను తిరునాదన్ చేపడతాడు. చెజియన్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయి? ఈ పోరాటంలో సీఏం కూతురు రత్నమాట పాత్ర ఏమిటన్నదే ఈ సినిమా కథ.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






