Sobhita Dhulipala | నెగెటివ్ రోల్‌లో అక్కినేని కోడలు – తమిళ సినిమా కోసం డూప్ లేకుండా ఫైట్స్
నాగచైతన్యతో పెళ్లి తర్వాత సినిమాలను తగ్గించింది శోభితా ధూళిపాళ. రెండేళ్లలో ఒకే ఒక సినిమా చేసింది. పెళ్లి తర్వాత గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న శోభిత ఛాలెంజింగ్ పాత్రల కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం తమిళంలో వెట్టువమ్ అనే సినిమా చేస్తోంది.
Naresh N
Entertainment | Published On Sep 19, 2026, 7.12 pm IST

కబాలి, కాలా సినిమాల ఫేమ్ పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న వెట్టువమ్‌లో రాధి అనే పాత్రలో శోభిత కనిపించబోతుంది.

వెట్టువమ్‌లో శోభిత పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో యాక్షన్ ప్రధానంగా సాగే పాత్రలో అక్కినేని కోడలు కనిపించబోతుంది.

ఈ తమిళ సినిమా కోసం మల్లఖంబ , ఆడిమురై లాంటి ప్రాచీన యుద్ధకళతో పాటు మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నట్లు శోభిత చెప్పింది

వెట్టువమ్‌లోని యాక్షన్ ఎపిసోడ్స్‌లో శోభిత డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ స్వయంగా చేసినట్లు డైరెక్టర్ పా రంజిత్ పేర్కొన్నారు.

ఈ కోలీవుడ్ మూవీలో శోభిత పాత్ర నెగెటివ్ షేడ్స్‌లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వెట్టువమ్‌లో ఆర్య, దినేష్, కలైయరాసన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

పొన్నియన్ సెల్వన్ తర్వాత తమిళంలో శోభిత చేస్తోన్న మూవీ ఇది.

చివరగా తెలుగులో చీకటిలో అనే సినిమా చేసింది శోభిత. థియేటర్లలో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ థ్రిల్లర్ మూవీ రిలీజైంది.
తాజావార్తలు
- ●Deepika Padukone | రెండోసారి తల్లయిన దీపికా పడుకోణ్ - పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్
- ●Street Vendors UPI Rules | చిరు వ్యాపారుల నెత్తిన యూపీఐ పిడుగు.. రూ.1 లక్ష దాటితే మర్చంటేనా?
- ●Kodada Mega Job Mela | కోదాడలో ఉద్యోగాల సునామీ: 350 కంపెనీలు.. 32 వేల మంది అభ్యర్థులు
- ●బి-ఫామ్‌తో దానం బుక్.. కండువా ఎమ్మెల్యేల సంగతేంటి?
- ●Danam Nagender | సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్
- ●Ponguleti Srinivas Reddy | 44 కాలనీల్లో 22ఏ సమస్యను పరిష్కరించాం

Deepika Padukone | రెండోసారి తల్లయిన దీపికా పడుకోణ్ - పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్

Street Vendors UPI Rules | చిరు వ్యాపారుల నెత్తిన యూపీఐ పిడుగు.. రూ.1 లక్ష దాటితే మర్చంటేనా?

Kodada Mega Job Mela | కోదాడలో ఉద్యోగాల సునామీ: 350 కంపెనీలు.. 32 వేల మంది అభ్యర్థులు

బి-ఫామ్‌తో దానం బుక్.. కండువా ఎమ్మెల్యేల సంగతేంటి?


