Aditi Rao Hydari | అదే నా డ్రీమ్ ప్రాజెక్ట్ : అదితి రావు హైదరీ
Aditi Rao Hydari | ప్రముఖ నటి అదితి రావు హైదరీ ఆర్ట్ సినిమాల భవితవ్యం, బాలీవుడ్‌లో తన ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గాంధీ టాక్స్ సినిమా ఒప్పుకోవడానికి కారణాలను సైతం వివరించింది.
Entertainment | Published On Feb 8, 2026, 2.30 pm IST
Aditi Rao Hydari | ప్రముఖ నటి అదితి రావు హైదరీ ఆర్ట్ సినిమాల భవితవ్యం, బాలీవుడ్‌లో తన ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గాంధీ టాక్స్ సినిమా ఒప్పుకోవడానికి కారణాలను సైతం వివరించింది. సైలెంట్ ఫిల్మ్‌లో నటించాలన్నది తన కల అని, ఈ క్రమంలో ‘గాంధీ టాక్స్’ అవకాశం వచ్చినప్పుడు చాలా ఆనందంగా అనిపించిందని తెలిపింది. ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా మార్చింది దాని టీమ్ అని, దర్శకుడు కిశోర్ కథను రూపొందించిన విధానం, ఏఆర్ రెహమాన్ సంగీతం, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, సిద్ధార్థ్ జాధవ్ లాంటి నటీనటులు సినిమాలో భాగం కావడం ఇంకా ప్రత్యేకతను తీసుకువచ్చిందని చెప్పింది.
మూవీలో తన పాత్ర కేవలం ప్రేమ కథకే పరిమితం కాకుండా కీలకమైన భావోద్వేగ భాగమని దర్శకుడు స్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. నటిగా ప్రతి సినిమా ఒక సవాలేనని.. అయితే సైలెంట్ ఫిల్మ్‌లో ఆ సవాళ్లు కొంచెం భిన్నంగా ఉంటాయని చెప్పింది. ఇందులో డైలాగులు ఉండవు. శరీర కదలికలు, కళ్ల ద్వారానే హావభావాలు, మనసులో కలిగిన అనుభూతితోనే అన్నీ ప్రదర్శించాల్సి వస్తుందని.. మాటలు లేకుండా భావాలను వ్యక్తపరచే విధానం తనకు చాలా ఇష్టమని చెప్పింది. సైలెంట్ సినిమాలు చాలామందికి కొత్త కావడంతో వాటి గమనం కొంచెం నెమ్మదిగా ఉంటుందని, థియేటర్లలో ఈ సినిమాలకు సరైన సమయం ఇవ్వడం లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది.
‘శుక్రవారం ముగిసేలోపే సినిమాల భవితవ్యాన్ని నిర్ణయించేస్తున్నాం’.. కానీ, ఇలాంటి సినిమాలకు సమయం అవసరమని.. అలాంటి సినిమాల విషయంలో ఓపికగా ఉండాలన్నారు. బాలీవుడ్‌లో తన ప్రయాణంపై స్పందిస్తూ.. తనకు మంచి పాత్రలు దొరికినప్పుడే సినిమాలు చేస్తానని అదితి స్పష్టం చేసింది. బాలీవుడ్‌కు బయట నుంచి వచ్చిన వారంతా ప్రతి సినిమాతో తమను తాము నిరూపించుకోవాల్సి ఉంటుందని, ఇందులో ఎలాంటి అసంతృప్తి, నెగెటివిటీ లేదని పేర్కొంది. సినిమాలు సులభంగా దక్కవని.. ప్రతి కొత్త సినిమా తనకో కొత్త పరీక్షలాంటిదని తెలిపింది. 2011 నుంచి తాను పని చేస్తున్నానని, ప్రతిభకు తగిన అవకాశాలు దొరుకుతాయని నమ్మకం ఉందని.. ఎంతో మంది ప్రతిభావంతులైన దర్శకులతో పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పుకొచ్చింది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



