Mrunal Thakur | పెద్ది మూవీలో ఐటమ్ సాంగ్ చేస్తోందా? సమాధానం దాటవేసిన మృణాల్..!
Mrunal Thakur | సీతారామం ఫేమ మృణాల్ ఠాగూర్ ప్రస్తుతం తెలుగులో అడివి శేష్‌తో డెకాయిట్ మూవీలో నటిస్తున్నది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ కార్యక్రమానికి హాజరైన మృణాల్ ఠాగూర్ సినిమా విశేషాలతో పాటు తన కెరీర్‌పై స్పందించింది.
Entertainment | Published On Apr 6, 2026, 1.05 pm IST
Mrunal Thakur | సీతారామం ఫేమ మృణాల్ ఠాగూర్ ప్రస్తుతం తెలుగులో అడివి శేష్‌తో డెకాయిట్ మూవీలో నటిస్తున్నది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ కార్యక్రమానికి హాజరైన మృణాల్ ఠాగూర్ సినిమా విశేషాలతో పాటు తన కెరీర్‌పై స్పందించింది. అయితే, ఇటీవల ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లుగా వచ్చిన వార్తలపై ప్రశ్నించగా తప్పించుకునే ప్రయత్నం చేసింది. గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ కనిపించనుందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కెరీర్‌లో తొలిసారిగా ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లుగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఐటమ్ సాంగ్‌పై మీడియా ప్రశ్నించగా.. మృణాల్ సమాధానం ఇవ్వకుండా దాట వేసింది.
హిందీ ప్రేక్షకులు తాను తెలుగు అమ్మాయిగా భావిస్తారని.. స్థానిక భావజాలంతో ఉన్న కథల్లో నటించడం తనకు ఇష్టమని తెలిపింది. ఐటమ్ సాంగ్‌లో నటిస్తున్నారా లేదా అని అడిగితే మాత్రం ధ్రువీకరించకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా.. పెద్ది మూవీలో ఐటమ్ సాంగ్ ఇంకా చిత్రీకరించాల్సి ఉందని సమాచారం. హిందీ సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఆ తర్వాత హిందీ సినిమాల్లో నటించింది. సీతారామంతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్, కల్కి 2898 ఏడీ మూవీలో అతిథి పాత్రలో నటించింది. ప్రస్తుతం డెకాయిట్‌లో జులియట్ పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న ఏఏ22xఏ6 కీలకపాత్రలో నటిస్తోంది. అలాగే, హిందీలో హే జవానీ తో ఇష్క్ హో హేతో పాటు పూజా మేరీ జాన్‌లోనూ కనిపించనుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



