Shruti Haasan | నాన్సెన్స్ అంటూ పాపరాజీలపై ఆగ్రహం వ్యక్తం చేసిన శృతి హాసన్..!
Shruti Haasan | పాపరాజీల వ్యవహారశైలిపై ఇటీవల పలువురు హీరోయిన్లు గళం విప్పారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు అసౌకర్యానికి గురైయ్యారు. ఫోటోలు, వీడియోల కోసం అనవసర వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత హద్దులు దాటడం వంటి చర్యలపై పలువురు నటీమణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Entertainment | Published On Apr 19, 2026, 8.55 pm IST
Shruti Haasan | పాపరాజీల వ్యవహారశైలిపై ఇటీవల పలువురు హీరోయిన్లు గళం విప్పారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు అసౌకర్యానికి గురైయ్యారు. ఫోటోలు, వీడియోల కోసం అనవసర వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత హద్దులు దాటడం వంటి చర్యలపై పలువురు నటీమణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ క్రమంలోనే పాపరాజీలతో సౌత్ బ్యూటీ శృతి హాసన్ సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇటీవల ముంబయిలో రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఫొటోగ్రాఫర్లు ఫొటోలు, వీడియోలు తీశారు.
అదే సమయంలో ఓ ఫొటోగ్రాఫర్ మమ్మా అంటూ సంభోధించగా.. శృతి అసహనం వ్యక్తం చేసింది. ఎవరు మమ్మా? నేను నీ తల్లినా? ఏమంటున్నావు? నాన్సెన్స్! అంటూ ఆమె కాస్త గట్టిగానే స్పందించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు పాపరాజీల ప్రవర్తనపై విమర్శలు గుప్పించారు. పాపులారిటీ కోసం అమ్మాయిలను ఇబ్బంది పెట్టడం సరికాదు.. కొంచెమైనా సిగ్గు ఉండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే ప్రోవోక్ చేస్తారంటూ మరికొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక శృతి సినిమాల విషయానికి వస్తే.. ఆకాశంలో ఒక తారా మూవీతో కాల్ మీ బే2 ఓటీటీ సిరీస్‌లో నటిస్తోంది.
Shruti Hasan was going to a party. Someone called her Mumma, She got angry and replied brutally 😭 pic.twitter.com/gl6EQa0vOE
— Chota Don (@choga_don) April 18, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



