Shruti Haasan | 40 ఏళ్ల వయసులోనూ సింగిలే.. పెళ్లిపై శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Shruti Haasan | టాలీవుడ్ బ్యూటీ శ్రుతి హాసన్ తన వ్యక్తిగత జీవితం, పెళ్లి, భాగస్వామ్యం, మాతృత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 40 ఏళ్ల వయసులోనూ సింగిల్‌గా ఉండడంపై తనకు ఎలాంటి అసౌకర్యం లేదని తెలిపింది. పెళ్లి అనేది తప్పనిసరి అనే సంప్రదాయ ఆలోచనతో తాను ఏకీభవించనని పేర్కొంది. సోహా అలీఖాన్ నిర్వహించే పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న శ్రుతి.. సంబంధాలు, వివాహ వ్యవస్థపై తన అభిప్రాయాలను పంచుకుంది.
Entertainment | Published On Sep 23, 2026, 4.29 pm IST
Shruti Haasan | టాలీవుడ్ బ్యూటీ శ్రుతి హాసన్ తన వ్యక్తిగత జీవితం, పెళ్లి, భాగస్వామ్యం, మాతృత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 40 ఏళ్ల వయసులోనూ సింగిల్‌గా ఉండడంపై తనకు ఎలాంటి అసౌకర్యం లేదని తెలిపింది. పెళ్లి అనేది తప్పనిసరి అనే సంప్రదాయ ఆలోచనతో తాను ఏకీభవించనని పేర్కొంది. సోహా అలీఖాన్ నిర్వహించే పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న శ్రుతి.. సంబంధాలు, వివాహ వ్యవస్థపై తన అభిప్రాయాలను పంచుకుంది. గతంలో ఒకసారి పెళ్లి చేసుకునేంత వరకు వెళ్లానని, ఆ అనుభవం తన ఆలోచనలను మార్చలేదని చెప్పింది. తాను పెళ్లికి వ్యతిరేకం కాదని శ్రుతి స్పష్టం చేసింది. సమాజం నిర్దేశించిన మూసలో ఇమిడిపోవడం తనకు ఎప్పుడూ ఇష్టం లేదని చెప్పింది. జీవితంలో ఒకరితో ఒకరు కలిసి ఉండటం, పరస్పరం తోడుగా నిలవడానికే తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని తెలిపింది. వివాహం చుట్టూ జరిగే భారీ వేడుకలు, ఖర్చుల కంటే ఇద్దరి మధ్య ఉండే అనుబంధం, ఇచ్చుకునే మాట ముఖ్యమని శ్రుతి అభిప్రాయపడింది. పెళ్లి కోసం భారీగా ఖర్చు చేసే డబ్బును అవసరమైన వారికి, స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తే బాగుంటుందని సరదాగా వ్యాఖ్యానించింది.
ప్రతిరోజూ ఒకరినొకరు ఎంచుకోవడం ఇష్టం..
తన సంబంధాల గురించి మాట్లాడుతూ.. పెళ్లి అనే చట్టపరమైన బంధం కంటే ప్రతిరోజూ ఇద్దరూ ఒకరినొకరు ఎంచుకోవడం తనకు నచ్చుతుందని శ్రుతి చెప్పింది. ఒకసారి పెళ్లికి దగ్గరగా వెళ్లినప్పటికీ.. పెళ్లి అనే ఆలోచన తనను భయపెట్టలేదని తెలిపింది. అయితే పెళ్లిళ్ల కోసం చేసే ఆర్భాటపు ఖర్చుల విషయంలో మాత్రం తాను సౌకర్యంగా ఉండలేనని పేర్కొంది. మాతృత్వంపైనా శ్రుతి తన అభిప్రాయాలను వెల్లడించింది. తాను దత్తత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది. ‘నాకు అమ్మగా ఉండడం చాలా ఇష్టం. దత్తత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను’ అని పేర్కొంది. అదే సమయంలో బయోలాజికల్‌గా తల్లి కావాలనే ఆలోచనను కూడా పరిశీలించాలనుకుంటున్నట్లు తెలిపింది. తన వ్యక్తిగత జీవితం, సంబంధాలపై ప్రజల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుందని శ్రుతి పేర్కొంది. గతంలో ఆర్టిస్ట్ శాంతను హజారికాతో శ్రుతి కొంతకాలం రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. 2024లో వీరిద్దరూ విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి శ్రుతి తన కెరీర్‌పై దృష్టి సారించింది.
సినిమాల విషయానికొస్తే..
ఇక సినిమాల విషయానికి శ్రుతి హసన్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కూలీ’లో శ్రుతి హాసన్ చివరిసారిగా కనిపించింది. 2025లో విడుదలైన ఈ చిత్రంలో నాగార్జున అక్కినేని, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, సత్యరాజ్, రచిత రామ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.518 కోట్ల వసూళ్లు సాధించింది. పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. రామ్‌చరణ్, జాన్వీ కపూర్‌తో కలిసి స్టెప్పులేసింది. ప్రస్తుతం తమిళంలో ట్రైన్ మూవీలో నటిస్తోంది. అలాగే, తెలుగులో ఆకాశంలో ఒక తార మూవీలో నటిస్తోంది. ఈ మూవీలో పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో దూల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నాడు. సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా పరిచయమవుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Salakatla Brahmotsavams | ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. సమష్టి కృషే కారణమన్న టీటీడీ చైర్మన్ నాయుడు..
సెప్టెంబర్ 23, 2026

Brahmotsavam 2026 | వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం.. సుదర్శన చక్ర స్పర్శతో పావనమైన పుష్కరిణి జలాలు
సెప్టెంబర్ 23, 2026

Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!
సెప్టెంబర్ 22, 2026
తాజావార్తలు
- ●Harish Rao | 4 వేలకు అవకాశం ఉంటే 800 క్యూసెక్కులే ఎందుకు ఎత్తిపోస్తున్నవ్..?
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. మెటల్స్ షేర్ల దూకుడు..
- ●GPT-6 Sol | ఏఐ యూజర్లకు గుడ్ న్యూస్.. చాట్ జీపీటీ ధరలు తగ్గింపు..
- ●Kavitha Kalvakuntla RIMS | ఆదిలాబాద్ రిమ్స్ మరణాలపై కవిత ఆగ్రహం.. రాష్ట్ర ప్రభుత్వానికి 30 రోజుల అల్టిమేటం
- ●Salakatla Brahmotsavams | ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. సమష్టి కృషే కారణమన్న టీటీడీ చైర్మన్ నాయుడు..
- ●Adilabad RIMS Fire Accident | ఆదిలాబాద్ రిమ్స్ అగ్నిప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి: సుమోటోగా కేసు స్వీకరించిన తెలంగాణ మానవ హక్కుల కమిషన్

Harish Rao | 4 వేలకు అవకాశం ఉంటే 800 క్యూసెక్కులే ఎందుకు ఎత్తిపోస్తున్నవ్..?

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. మెటల్స్ షేర్ల దూకుడు..

GPT-6 Sol | ఏఐ యూజర్లకు గుడ్ న్యూస్.. చాట్ జీపీటీ ధరలు తగ్గింపు..

Kavitha Kalvakuntla RIMS | ఆదిలాబాద్ రిమ్స్ మరణాలపై కవిత ఆగ్రహం.. రాష్ట్ర ప్రభుత్వానికి 30 రోజుల అల్టిమేటం



