Shruti Haasan | చెన్నైలో కొత్త ఇళ్లు కొన్న శృతి హాసన్ – ధర ఎన్ని కోట్లంటే?
హీరోయిన్ శృతి హాసన్ చెన్నైలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసింది. సోమవారం సంప్రదాయ బద్దంగా నూతన గృహ ప్రవేశ వేడుకలను జరుపుకున్న ఈ బ్యూటీ కొత్త ఇంటిలో అడుగుపెట్టింది. ఈ వేడుకల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
Entertainment | Published On Jul 14, 2026, 10.13 am IST
Shruti Haasan | కమల్ హాసన్ తనయ శృతి హాసన్ చెన్నైలో కొత్త ఇళ్లు కొన్నది. నూతన గృహ ప్రవేశ వేడుకలను సంప్రదాయ బద్దంగా జరుపుకుంది. హీరోయిన్‌గా సినీ జర్నీ ఆరంభమైన తొలినాళ్లలోనే ముంబైకి షిప్టయ్యింది శృతి హాసన్. గత పదహారేళ్లుగా ముంబైలోనే ఉంటున్న ఈ బ్యూటీ తిరిగి సొంత ఊరికి వచ్చేసింది. చెన్నైలో కొత్త ఇళ్లును కొనుగోలు చేసింది. సోమవారం నాడు నూతన గృహ ప్రవేశ వేడుకల తాలూకు పూజలను సంప్రదాయబద్దంగా నిర్వహించింది. ఈ పూజల్లో నేలపై కూర్చొని సింపుల్ లుక్‌లో శృతి హాసన్ కనిపించింది. ఈ నూతన గృహ ప్రవేశ వేడుకల్లో సోదరి అక్షర హసన్‌తో పాటు శృతి హాసన్ స్నేహితులు, సన్నిహితులు కొందరు పాల్గొన్నారు. శృతి హాసన్ తల్లిదండ్రులు కమల్‌హాసన్, సారిక మాత్రం ఈ వేడుకలో కనిపించకపోవడం ఆసక్తికరంగా మారింది. శృతిహాసన్ నూతన గృహ ప్రవేశ వేడుకల తాలూకు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలోవైరల్ అవుతోన్నాయి.
30 కోట్లు...
శృతి హాసన్ చెన్నై ఇంటి ధర 25 నుంచి 30 కోట్ల మధ్య ఉంటుందని అంటున్నారు. తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలని శృతి హాసన్ చెన్నైకి షిప్టయ్యిందని అంటున్నారు. అంతే కాకుండా దక్షిణాది సినిమాలపై మరింతగా దృష్టి సారించి తిరిగి కెరీర్‌నే నిలబెట్టుకోవాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
రెట్రో థీమ్
ముంబైలో శృతి హాసన్ ఇంటిని తన మ్యూజిక్ టేస్ట్‌కు అనుగుణంగా రెట్రో స్టైల్ థీమ్‌తో నిర్మించుకుంది. గోడలకు రంగులు లేకుండా...సహజసిద్ధమైన ఫర్నిచర్‌తో డిఫరెంట్‌గా ఇంటిని డిజైన్ చేసుకుంది. చెన్నై ఇళ్లు మాత్రం మోడ్రన్ స్టైల్‌లో ఉండబోతున్నట్లు చెబుతున్నారు.
పెద్దిలో స్పెషల్ సాంగ్...
హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో స్పెషల్ సాంగ్స్‌తో పాటు రోల్స్ చేస్తోంది శృతి హాసన్. ఇటీవల రిలీజైన రామ్‌చరణ్ పెద్దిలో ఐటెంసాంగ్‌లో నటించింది శృతి హాసన్. ఈ పాట కోసం మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. ప్రస్తుతం తెలుగులో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న ఆకాశంలో ఒక తార సినిమాలో బోల్డ్ రోల్‌లో కనిపించబోతుంది. తమిళంలో విజయ్ సేతుపతి ట్రైన్ రోల్‌లో గెస్ట్‌గా నటిస్తోంది.
తాజావార్తలు
- ●Jana Nayagan vs Sigma | తండ్రితో బాక్సాఫీస్ ఫైట్ - తనయుడి త్యాగం - దళపతి విజయ్ కొడుకు డెబ్యూ మూవీ వాయిదా?
- ●Prashant Kishor | రూ. 5.77 కోట్ల అప్పులు, కారు లేదు, ఎనిమిది క్రిమినల్ కేసులు.. ప్రశాంత్ కిషోర్ ఆస్తుల వివరాలు
- ●NCL Recruitment | నార్తర్న్ కోల్డ్ఫీల్డ్స్లో 259 మైనింగ్ సిర్దార్, సర్వేయర్ ఉద్యోగాలు..
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి..
- ●Donald Trump | ఇరాన్ పని అయిపోయింది.. మొజ్తబా ఖమేనీ 90 శాతం చనిపోయినట్లే : డొనాల్డ్ ట్రంప్
- ●Stock Markets | పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల దెబ్బ.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు..

Jana Nayagan vs Sigma | తండ్రితో బాక్సాఫీస్ ఫైట్ - తనయుడి త్యాగం - దళపతి విజయ్ కొడుకు డెబ్యూ మూవీ వాయిదా?

Prashant Kishor | రూ. 5.77 కోట్ల అప్పులు, కారు లేదు, ఎనిమిది క్రిమినల్ కేసులు.. ప్రశాంత్ కిషోర్ ఆస్తుల వివరాలు

NCL Recruitment | నార్తర్న్ కోల్డ్ఫీల్డ్స్లో 259 మైనింగ్ సిర్దార్, సర్వేయర్ ఉద్యోగాలు..

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి..



