Shraddha Kapoor | త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న శ్రద్ధా కపూర్..! పిన్ని తేజస్విని కొల్హాపురే ఏమందంటే..?
Shraddha Kapoor | బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె వ్యక్తిగత జీవితం కూడా తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా తన రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ రాహుల్ మోదీని త్వరలోనే పెళ్లి చేసుకోనుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రద్ధాకపూర్ పిన్ని, నటి తేజస్విని కొల్హాపురే పెళ్లి రూమర్స్‌పై స్పందించారు.
Entertainment | Published On Mar 18, 2026, 1.05 pm IST
Shraddha Kapoor | బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె వ్యక్తిగత జీవితం కూడా తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా తన రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ రాహుల్ మోదీని త్వరలోనే పెళ్లి చేసుకోనుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రద్ధాకపూర్ పిన్ని, నటి తేజస్విని కొల్హాపురే పెళ్లి రూమర్స్‌పై స్పందించారు. శ్రద్ధా పెళ్లి వార్తలపై ఆమెను ప్రశ్నించగా నిజం చెప్పాలంటే తనకు ఏమీ తెలియదు అన్నారు.
ఈ విషయంలో తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. శ్రద్ధా తన కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తుందని, ఆ విషయంలో తాము గర్వపడుతున్నామని పేర్కొన్నారు. ఇది చాలా మంచి విషయమని, ఈ స్థాయికి రావడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుందన్నారు. శ్రద్ధకు ఆమె తల్లి పద్మిని కొల్హాపురే మార్గం చూపించారన్నారు. పద్మిని కొల్హాపురే ఆ కాలంలో పేరు ప్రఖ్యాతలు ప్రత్యేకమని, దాన్ని ఈ కాలంలో పోల్చలేమని తేజస్విని స్పష్టం చేశారు. ఆ వారసత్వాన్ని శ్రద్ధా విజయవంతంగా కొనసాగిస్తుందని, కుటుంబానికి మరింత పేరు వస్తుంన్నందుకు చాలా సంతోషంగా ఉన్నామన్నారు. కుటుంబ సభ్యులు తరచు తమ సినిమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, లుక్స్‌ను పరస్పరం షేర్ చేసుకుంటారని, అవసరమైతే ఒకరికొకరు సలహాలు ఇచ్చిపుచ్చుకుంటారన్నారు.
ఇదిలా ఉండగా శ్రద్ధా కపూర్ పెళ్లి చేసుకోనుందంటూ వార్తలు రావడం ఇదే తొలిసారేం కాదు. గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి వైరల్‌గా మారాయి. ఇటీవల శ్రద్ధా ఓ ఆభరణాల కంపెనీకి సంబంధించిన యాడ్ షూట్‌లో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేశారు. వెంటనే కామెంట్ సెక్షన్ కామెంట్స్‌తో నిండిపోయింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అని ప్రశ్నించగా.. స్పందించింది. మై కరూంగీ అంటూ సమాధానం ఇచ్చింది. ఇది క్షణాల్లో వైరల్ అయ్యింది. శ్రద్ధా గత కొంతకాలంగా రాహుల్ మోదీతో రిలేషన్‌లో ఉంది. 2024 ముంబయిలో ఓ డిన్నర్ డేట్ సమయంలో ఇద్దరు కలుసుకున్నారని, అప్పటి నుంచి లవ్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలతో పాటు పలు ప్రైవేట్ కార్యక్రమాలు, సినిమాలకు ఇద్దరు జంటగా వెళ్లడం కనిపించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



