Shraddha Kapoor | సీనియర్ హీరోకు జోడీగా శ్రద్ధా కపూర్.. ఏజ్ గ్యాప్‌పై సోషల్ మీడియాలో చర్చ..!
Shraddha Kapoor | సీనియర్ హీరో అమీర్ ఖాన్ సరసన శ్రద్ధా కపూర్ నటించనున్నారనే వార్తలు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్‌పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తుండగా, బయోపిక్ కాస్టింగ్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
Entertainment | Published On Apr 22, 2026, 8.20 pm IST
Shraddha Kapoor | బాలీవుడ్‌లో ఓ రాబోయే బయోపిక్ కాస్టింగ్ చుట్టూ ప్రస్తుతం విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త అష్నీర్ గ్రోవర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో అమీర్ ఖాన్, శ్రద్ధా కపూర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ బయోపిక్‌లో అమీర్ ఖాన్ ప్రముఖ వ్యాపారవేత్త అష్నీర్ గ్రోవర్ పాత్రను పోషించే అవకాశం ఉంది. ఆయన వ్యాపార విజయాలు, అలాగే వివాదాస్పద అంశాలు సైతం సినిమాలో భాగంగా చూపించనున్నట్లు తెలుస్తోంది.
అష్నీర్ గ్రోవర్ ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ ద్వారా గుర్తింపు పొందారు. ఆయన భారత్‌పే మాజీ మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. అదే సమయంలో అష్నీర్ గ్రోవర్ భార్య మాధురి జైన్ గ్రోవర్ పాత్రకు శ్రద్ధా కపూర్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆమె కూడా భారత్‌పేలో కీలక బాధ్యతల్లో పనిచేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అమీర్ ఖాన్–శ్రద్ధా కపూర్ మధ్య సుమారు 22 ఏళ్ల వయసు తేడా ఉండడంతో ఈ కాస్టింగ్‌పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొంతమంది ప్రేక్షకులు పాత్రలకు అనుగుణంగా ఎంపిక సరైనదేనని భావిస్తుండగా, మరికొందరు నిజజీవిత కథల ఆధారంగా రూపొందే బయోపిక్స్‌లో మరింత వాస్తవానికి దగ్గరగా కాస్టింగ్ ఉండాలని అభిప్రాయపడుతున్నారు.
ఇక శ్రద్ధా కపూర్ ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్‌పై అవగాహన పెంచుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి రాహుల్ మోదీ సహకారం అందిస్తున్నట్లు కూడా సమాచారం. గత కొంతకాలంగా రాహుల్ మోదీతో శ్రద్ధ డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. రాబోయే రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, శ్రద్ధా కపూర్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లో ఈత అనే బయోపిక్‌లో నటిస్తోంది. అలాగే, మహవతార్ ప్రాజెక్టులో శ్రద్ధా పేరును సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



