త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shivani Nagaram | శ్రీవారి దర్శనంపై హీరోయిన్ శివానీ క్లారిటీ.. ఇక వివాదానికి తెర‌ప‌డేనా..?

Shivani Nagaram | ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్‌’, 'లిటిల్ హార్ట్స్' ఫేమ్ శివానీ నాగారం తిరుమల శ్రీవారి దర్శనంపై చేసిన వ్యాఖ్యలు ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద రచ్చకి కారణమయ్యాయి. సాధారణ భక్తులను క్షణాల్లోనే మళ్లీ పక్కన పెట్టే విధానం ఉన్నప్పటికీ.. ఒక హీరోయిన్‌కు 15 నిమిషాల దర్శనం లభించిందంటూ చర్చ నడిచింది.

P

Entertainment | Published On Feb 25, 2026, 9.25 pm IST

Shivani Nagaram | శ్రీవారి దర్శనంపై హీరోయిన్ శివానీ క్లారిటీ.. ఇక వివాదానికి తెర‌ప‌డేనా..?
Advertisement

Shivani Nagaram | ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్‌’, 'లిటిల్ హార్ట్స్' ఫేమ్ శివానీ నాగారం తిరుమల శ్రీవారి దర్శనంపై చేసిన వ్యాఖ్యలు ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద రచ్చకి కారణమయ్యాయి. సాధారణ భక్తులను క్షణాల్లోనే మళ్లీ పక్కన పెట్టే విధానం ఉన్నప్పటికీ.. ఒక హీరోయిన్‌కు 15 నిమిషాల దర్శనం లభించిందంటూ చర్చ నడిచింది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు, “సెలబ్రిటీలకు ప్రత్యేక ప్రోటోకాల్ ఇవ్వబడుతున్నారా?” అంటూ ప్రశ్నించారు. ఈ వివాదం నేపథ్యంలో శివానీ తన వీడియో సందేశంలో నిజాన్ని చెప్పారు. ఆమె తెలిపినట్లే, ప్రైవేట్ యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో తన ఆధ్యాత్మిక అనుభవాలను పంచుకోవడం తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు.

“నేను కేదార్‌నాథ్, రామకోటి, తిరుపతి అనుభవాలను పంచుకున్నాను. 15 నిమిషాల దర్శనం ఇప్పుడే హైలైట్ అవుతోంది. కానీ, నిజంగా ఆ టైమ్ మొత్తం క్యూ లో గడిపిన సమయమే 15 నిమిషాలు. స్వామివారి దగ్గరికి వెళ్లి తిరిగి వచ్చేవరకు కొంత కొంత మాత్రమే కనిపిస్తారు. గర్భాలయం ముందు నన్ను 15 నిమిషాలు నిలిపారు అనే అర్థం కాదు” అని ఆమె వివరించారు. సెలబ్రిటీ హోదా కారణంగా ప్రత్యేక సదుపాయం ఇచ్చారన్న ఆరోపణలనూ ఆమె తిరస్కరించారు. “అక్టోబర్ 2025లో మా అమ్మతో ఎయిర్‌పోర్ట్‌లోనే రూ. 10,500 శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు కొనుక్కొని.. సాధారణ భక్తుల్లా క్యూ లైన్‌లో నిలిచి దర్శనం చేసుకున్నాను. తప్పుగా అర్థం చేసుకున్న వారికి క్షమాపణ చెబుతున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement
Advertisement