Shalini Pandey | ఒకేచోట ఆగిపోవడం ఇష్టం లేదు : షాలిని పాండే
Shalini Pandey | హీరోయిన్ షాలిని పాండే గురించి పరిచయం అవసరం లేదు. అర్జున్‌రెడ్డితో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపును పొందింది. అయితే, తనకు యాక్షన్ చిత్రాల్లో నటించాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టింది.
Entertainment | Published On Mar 27, 2026, 11.50 am IST
Shalini Pandey | హీరోయిన్ షాలిని పాండే గురించి పరిచయం అవసరం లేదు. అర్జున్‌రెడ్డితో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపును పొందింది. అయితే, తనకు యాక్షన్ చిత్రాల్లో నటించాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టింది. ధురంధర్ మూవీ తనకు బాగా నచ్చిందని తెలిపింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు స్పోర్ట్స్ అంటే ఇష్టమని, పలు క్రీడల్లోనూ పాల్గొన్నట్లు తెలిపింది. అందుకే యాక్షన్ సినిమాల్లో నటించాలని ఉందని, యాక్షన్‌లో ఉన్న థ్రిల్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందని షాలిని పేర్కొంది. తనకు కంఫర్ట్ జోన్ బయటకు వచ్చి కొత్త విషయాలు ప్రయత్నించాలని ఉందని, కామెడీ జానర్‌లోనూ కనిపించాలని ఉందని పేర్కొంది. ప్రేక్షకురాలిగా నాకు కామెడీ చాలా ఇష్టమని.. యాక్షన్, కామెడీ రెండూ నాకు సమానంగా నచ్చుతాయని చెప్పుకొచ్చింది.
ఇంకా మాట్లాడుతూ.. ‘నటిగా నన్ను ప్రేరేపించే వ్యక్తులతో పని చేయాలనుకుంటున్నాను. నన్ను నేను మెరుగుపరుచుకునేలా నన్ను ప్రోత్సహించే వారితో కలిసి పని చేయాలని ఉంది. ఒకేచోట ఆగిపోవడం నాకు ఇష్టం లేదు’ అని పేర్కొంది. తనకు ఇష్టమైన హీరోలు రణ్‌వీర్ సింగ్, హృతిక్ రోహన్ అని తెలిపింది. ‘రణ్‌వీర్ సింగ్ నటన నాకు చాలా ఇష్టం. ‘ధురంధర్’ చిత్రం చూసిన తర్వాత ఆయన ఏ పాత్రనైనా అద్భుతంగా చేయగలరని అనిపించింది. హృతిక్ రోషన్‌ను చిన్నప్పటి నుంచే చూస్తూ వచ్చాను. ఈ ఇద్దరితో కలిసి పని చేసే అవకాశం వస్తే చాలా ఆనందం’గా ఉంటుందని అని తెలిపింది. ఇదిలా ఉండగా.. షాలిని పాండే టాలీవుడ్‌లో అర్జున్‌రెడ్డితో కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత జయేశ్‌భాయ్ జోర్దాద్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో రణవీర్ సింగ్‌తో కలిసి నటించింది. ఇటీవల ‘రాహు కేతు’ మూవీతో పాటు ఈ ఏడాది విడుదలైన ‘బాండ్‌వాలే’ సిరీస్‌లో కనిపించింది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



