త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tripti Dimri | త్రిప్తి డిమ్రి బాలీవుడ్ మూవీపై వివాదం- రిలీజ్ చేయద్దంటూ కోర్టులో పిటిష‌న్

త్రిప్తి డిమ్రి బాలీవుడ్ మూవీ ఓ రోమియో రిలీజ్‌కు ముందే చిక్కుల్లో ప‌డింది. ఈ సినిమాను రిలీజ్ చేయ‌ద్దంటూ గ్యాంగ్‌స్ట‌ర్ హుస్సేన్ ఉస్తారా కూతురు ముంబాయి సెష‌న్ కోర్టులో పిటిష‌న్ వేసింది. షాహిద్ క‌పూర్ హీరోగా న‌టించిన ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 13న రిలీజ్ కాబోతుంది.

N

Entertainment | Published On Feb 2, 2026, 8.21 pm IST

Tripti Dimri | త్రిప్తి డిమ్రి బాలీవుడ్ మూవీపై వివాదం- రిలీజ్ చేయద్దంటూ కోర్టులో పిటిష‌న్
Advertisement

Tripti Dimri | షాహిద్ క‌పూర్ హీరోగా న‌టిస్తున్న ఓ రోమియో మూవీ రిలీజ్‌కు ముందే చిక్కుల్లో ప‌డింది. ఈ సినిమా విడుద‌ల‌పై స్టే విధించాలంటూ ముంబాయి గ్యాంగ్‌స్ట‌ర్ హుస్సేన్ ఉస్తారా కూతురు స‌నోబ‌ర్ షేక్ కోర్టును ఆశ్ర‌యించింది. ఓ రోమియో మూవీకి విశాల్ భ‌ర‌ద్వాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా న‌టించింది. దిశా ప‌టానీ, త‌మ‌న్నా, నానా ప‌టేక‌ర్, విక్రాంత్ మ‌స్సే కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

గ్యాంగ్‌స్ట‌ర్ జీవిత క‌థ‌తో...

1990 ద‌శ‌కంలో ముంబాయిని గ‌డ‌గ‌డ‌లాడించిన గ్యాంగ్‌స్ట‌ర్ హుస్సేన్ ఉస్తారా జీవితం ఆధారంగా ఓ రోమియో మూవీ తెర‌కెక్క‌బోతుంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్ర‌హీం ఆధిప‌త్యాన్ని బ‌లంగా వ్య‌తిరేకించాడు హుస్సేన్‌. దావూద్‌ను అంత‌మొందించ‌డానికి అత‌డు పోలీస్ ఇన్ఫార్మ‌ర్‌గా కూడా ప‌నిచేసిన‌ట్లు అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. కానీ పోలీసుల‌ రికార్డుల్లో మాత్రం హుస్సేన్ ఉస్తారా గ్యాంగ్‌స్ట‌ర్‌గానే ఉన్నాడు. 1998లో హుస్సేన్ ఉస్తారాను ఛోట ష‌కీల్ తో పాటు అత‌డి అనుచ‌రులు దారుణంగా హ‌త్య చేశారు.

రిలీజ్ చేయ‌ద్దు...

హుస్సేన్ ఉస్తారా పాత్ర‌ను ఓ రోమియో మూవీలో షాహిద్ క‌పూర్ చేస్తున్నాడు. పోలీస్ ఇన్ఫార్మ‌ర్‌, జ‌ర్న‌లిస్ట్‌గా ప‌నిచేసిన త‌న తండ్రిని క‌రుడుగ‌ట్టిన గ్యాంగ్‌స్ట‌ర్‌గా ఓ రోమియో మూవీలో చిత్రీక‌రించారంటూ హుస్సేస్ ఉస్తారా కూతురు స‌నోబ‌ర్ షేక్‌ ముంబై సెష‌న్ కోర్టులో పిటిష‌న్ వేసింది. ఈ సినిమాను విడుద‌ల చేయ‌ద్దంటూ పేర్కొన్న‌ది. ఈ సినిమా క‌థ‌, స‌న్నివేశాల‌ను త‌మ కుటుంబ ప‌రువు ప్ర‌తిష్ట‌ల‌ను భంగ‌ప‌రిచేలా ఉన్నాయ‌ని, త‌న తండ్రిని త‌ప్పుడు మ‌నిషిగా ఈ సినిమాలో చిత్రీక‌రించారంటూ స‌నోబ‌ర్ షేక్ త‌న పిటిష‌న్‌లో తెలిపారు.
ఓ రోమియోపై స‌నోబ‌ర్ షేక్ వేసిన పిటిష‌న్‌కు సంబంధించిన విచార‌ణ ఫిబ్ర‌వ‌రి 6న జ‌రుగ‌నుంది. షాహిద్ క‌పూర్‌, డైరెక్ట‌ర్ విశాల్ భ‌ర‌ద్వాజ్ కాంబోలో ఇది నాలుగో మూవీ. గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి క‌మీనే, హైద‌ర్‌తో పాటు రంగూన్ సినిమాలు చేశారు.

Advertisement
Advertisement