Sara Ali Khan | ప్రేక్షకులు నిరాశకు గురైతే నాకు బాధ కలుగుతుంది : సారా అలీ ఖాన్
Sara Ali Khan | బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్, విమర్శలు, అభిమానుల ప్రేమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆన్‌లైన్‌లో వచ్చే కామెంట్లు తన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయా అనే ప్రశ్నకు ఆమె నిజాయితీగా స్పందించింది.
Entertainment | Published On May 16, 2026, 9.15 am IST
Sara Ali Khan | బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్, విమర్శలు, అభిమానుల ప్రేమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆన్‌లైన్‌లో వచ్చే కామెంట్లు తన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయా అనే ప్రశ్నకు ఆమె నిజాయితీగా స్పందించింది. ప్రేక్షకుల కోసమే తాను నటిస్తానని, వారికి నిరాశ కలిగితే తనకు బాధ కలుగుతుందని పేర్కొంది. కాలక్రమేణా తన కోసం కూడా పని చేయడం నేర్చుకున్నానని, కెరీర్ ప్రారంభంలో ప్రేక్షకుల అభిప్రాయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చానని తెలిపింది. కానీ, తర్వాత తన పనిని తానే ఆస్వాదించడం ముఖ్యమని అర్థమైందని చెప్పింది. ‘నాపై ప్రభావం ఉండదని చెబితే అబద్ధం చెప్పినట్టే. ప్రేక్షకుల కోసమే నేను పని చేస్తాను. వాళ్లు నిరాశ చెందితే నాకూ బాధగానే ఉంటుంది. కానీ, ఈ ప్రయాణంలో ఒక దశకు వచ్చిన తర్వాత మన కోసం కూడా పని చేయడం ప్రారంభిస్తాం. అది నేను కొంచెం ఆలస్యంగా నేర్చుకున్నాను’ అని సారా చెప్పుకొచ్చింది.
పని విషయంలో నిజాయితీగా శ్రమించి, తాను చేయగలిగినంత ఉత్తమంగా చేశాననే నమ్మకం ఉంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడింది. ‘మన పని మనం ఆస్వాదిస్తూ, పూర్తిస్థాయిలో కృషి చేశామని అనిపిస్తే తర్వాత ఫలితాన్ని దేవుడిపై వదిలేయొచ్చు’ అని చెప్పింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. సారా అలీ ఖాన్ ప్రస్తుతం రొమాంటిక్ కామెడీ చిత్రం పతి పత్ని ఔర్ వోహ్ దో మూవీలో కీలకపాత్ర కనిపించనుంది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ సింగ్, వామికా గబ్బి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు ముదస్సర్ అజీజ్ తెరకెక్కిస్తున్న చిత్రం శుక్రవారం రిలీజైంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఉడ్తా తీర్ మూవీలో నటిస్తోంది. ఆకాశ్ కౌశిక్ దర్శకత్వంలో మూవీ తెరక్కెనుంది. ఆయుష్మాన్ ఖురాన కీలక పాత్రలో నటిస్తుండగా.. సాలామ్ సిద్దిఖీ, గుల్షన్ గ్రోవర్ సైతం ఈ మూవీలో కనిపించనున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



