త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sammuktha | కెరీర్ జోష్‌లో ఉండగానే.. పెళ్లి పీటలెక్కనున్న సంయుక్త..!

Sammuktha | టాలీవుడ్‌ బ్యూటీ సంయుక్త త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నది. ఓ వైపు వరుస అవకాశాలతో కెరీర్‌లో దూసుకుపోతున్నది మలయాళీ భామ. 30 ఏళ్ల వయసున్న ఈ నటి ఈ ఏడాది చివరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు ఫిలింనగర్‌ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

P

Entertainment | Published On Apr 22, 2026, 2.34 pm IST

Sammuktha | కెరీర్ జోష్‌లో ఉండగానే.. పెళ్లి పీటలెక్కనున్న సంయుక్త..!
Advertisement

Sammuktha | టాలీవుడ్‌లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఇటీవల పలువురు హీరోలు, హీరోయిన్లు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా హీరోయిన్ సైతం పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్. త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారనే ప్రచారం ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దాదాపు 30 ఏళ్ల వయసున్న ఈ నటి ఈ ఏడాది చివర్లో వివాహం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, సంయుక్త పెళ్లి వార్తలు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి రూమర్లు వినిపించగా, అప్పట్లో ఆమె స్వయంగా స్పందిస్తూ వ్యక్తిగత విషయాల కంటే తన నటనపై దృష్టి పెట్టాలని చెప్పి ఆ వార్తలకు చెక్ పెట్టింది.

అయినా, మళ్లీ అదే అంశం తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సంయుక్త కెరీర్ మంచి ఊపులో ఉంది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతూ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నది. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె, ఆ తర్వాత బింబిసార, విరూపాక్ష, సార్ వంటి చిత్రాలతో టాప్ హీరోయిన్ల జాబితాలోకి చేరింది. కథల ఎంపికలో చూపిస్తున్న జాగ్రత్త, సహజమైన నటన ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ప్రస్తుతం సంయుక్త తెలుగులో భారీ ప్రాజెక్ట్ స్వయంభులో నటిస్తోంది. ఈ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా కనిపించనున్నారు. అలాగే ‘బ్లాక్ గోల్డ్’ అనే మరో సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదే సమయంలో బాలీవుడ్, తమిళం, మలయాళం భాషల్లోనూ వరుస అవకాశాలతో ఆమె బిజీగా ఉంది. స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్, మహారాగ్ఞి, రామ్, బెంజ్ వంటి ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి.

ఇలాంటి సమయంలో పెళ్లి వార్తలు వెలుగులోకి రావడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఇటీవల కాలంలో పెళ్లి తర్వాత కూడా హీరోయిన్లు సినిమాల్లో కొనసాగుతున్న ట్రెండ్ నేపథ్యంలో, సంయుక్త కూడా కెరీర్‌ను కొనసాగించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ వార్తలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సాధారణంగా ఇలాంటి రూమర్లపై సెలబ్రిటీలు స్పందిస్తుంటారు. ఈసారి సంయుక్త ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పెళ్లి వార్తలు నిజమా కాదా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.

Advertisement
Advertisement