Kiara Advani | డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తోన్న రాఘవేంద్రరావు మాజీ కోడలు – కియారా అద్వానీతో బాలీవుడ్ మూవీ
టాక్సిక్ తర్వాత కియారా అద్వానీ నెక్స్ట్ మూవీ కన్ఫామ్ అయ్యింది. బాలీవుడ్‌లో ఓ సూపర్ నాచురల్ థ్రిల్లర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా ద్వారా రాఘవేంద్రరావు మాజీ కోడలు దర్శకురాలిగా హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది.
Naresh N
Entertainment | Published On Aug 18, 2026, 7.50 pm IST

కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన టాక్సిక్ మూవీ ఆగస్ట్ 26న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. యశ్ హీరోగా నటించిన ఈ మూవీలో నాదియా అనే పాత్రలో ఈ బాలీవుడ్ బ్యూటీ కనిపించబోతుంది.

టాక్సిక్ తర్వాత బాలీవుడ్‌లో ఓ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది కియారా అద్వానీ. ఈ సినిమాతో బాలీవుడ్ రైటర్ కనికా థిల్లాన్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది.

సైఫ్ అలీఖాన్, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీని ఫర్హాన్ అక్తర్ ప్రొడ్యూస్ చేయబోతున్నారు.

కనికా థిల్లాన్ రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడిని పెళ్లి చేసుకుంది. 2013లో పెళ్లి జరగ్గా...2017లో మనస్పర్థల కారణంగా ఈ జంట విడాకులు తీసుకున్నారు.

బాలీవుడ్‌లో ఎక్ విలన్ రిటర్స్న్, డుంకీ, రక్షా బంధన్, కేదార్‌నాథ్‌తో పాటు పలు బాలీవుడ్ సినిమాలకు స్టోరీ, స్క్రీన్‌ప్లే రైటర్‌గా పనిచేసింది కనికా థిల్లాన్.

తెలుగులో అనుష్క సైజ్ జీరో మూవీకి కూడా స్క్రీన్‌ప్లేను అందించింది కనికా థిల్లాన్.
తాజావార్తలు
- ●Minister Ponguleti | నెలాఖరులోగా 22-ఏ సమస్యను పరిష్కరిస్తాం
- ●Telangana BJP | బండి అవుట్.. ఈటల, అరుణ ఇన్
- ●Dasoju Sravan | 22A చట్టం ‘అర్బన్ ల్యాండ్ సీలింగ్’ కాదు.. ఇది అక్షరాలా ‘అర్బన్ పీపుల్స్ లూటింగ్’
- ●TN CM Vijay | రోజుకు 20 గంటల పని.. ఉదయం 4కే మంత్రులకు ఫోన్స్ చేస్తున్న తమిళనాడు సీఎం విజయ్
- ●Minister Uttam | ప్రతి చుక్కకూ లెక్కుండాలి
- ●MoRTH | గ్రీన్ వాహన యజమానులకు గుడ్ న్యూస్.. మరో 5 ఏళ్లు పెరగనున్న లైఫ్..

Minister Ponguleti | నెలాఖరులోగా 22-ఏ సమస్యను పరిష్కరిస్తాం

Telangana BJP | బండి అవుట్.. ఈటల, అరుణ ఇన్

Dasoju Sravan | 22A చట్టం ‘అర్బన్ ల్యాండ్ సీలింగ్’ కాదు.. ఇది అక్షరాలా ‘అర్బన్ పీపుల్స్ లూటింగ్’

TN CM Vijay | రోజుకు 20 గంటల పని.. ఉదయం 4కే మంత్రులకు ఫోన్స్ చేస్తున్న తమిళనాడు సీఎం విజయ్


