Rukmini Vasanth | రిషబ్ శెట్టితో విభేదాలు.. ప్రచారానికి తెరదించిన రుక్మిణి వసంత్..!
Rukmini Vasanth | కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇటీవల ఓ వార్త అందరినీ షాక్ గురి చేసింది. కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టికి హీరోయిన్ రుక్మిణి వసంత్, నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌కు విభేదాలు ఉన్నట్లుగా వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఇందుకు కారణం ఇన్‌స్టాగ్రామ్‌లో రిషబ్ అందరినీ అన్‌ఫాలో చేయడమే దానికి కారణం.
Entertainment | Published On Apr 1, 2026, 8.15 pm IST
Rukmini Vasanth | కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇటీవల ఓ వార్త అందరినీ షాక్ గురి చేసింది. కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టికి హీరోయిన్ రుక్మిణి వసంత్, నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌కు విభేదాలు ఉన్నట్లుగా వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఇందుకు కారణం ఇన్‌స్టాగ్రామ్‌లో రిషబ్ అందరినీ అన్‌ఫాలో చేయడమే దానికి కారణం. ఇటీవల జరుగుతున్న ప్రచారానికి హీరోయిన్ రుక్మిణి వసంత్ చెక్ పెట్టింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని, కేవలం రూమర్స్ మాత్రమేనని స్పష్టం చేసింది.

ఇటీవల రిషబ్ శెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో అందరినీ అన్‌ఫాలో చేస్తూ తీసుకున్న నిర్ణయంతో పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. చాలామంది సినీ ప్రముఖులను ఆయన అన్‌ఫాలో చేశారు. ప్రస్తుతం ఆయన తన భార్యతో పాటు ప్రొడక్షన్ హౌస్, చారిటీ ఫౌండేషన్లకు సంబంధించిన అకౌంట్స్‌ని మాత్రమే ఫాలో అవుతున్నారు. దాంతో పలువురు రుక్మిణి వసంత్, హోంబలే ఫిల్మ్స్‌తో విభేదాలు వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే సోషల్ మీడియాను పరిశీలిస్తే వాస్తవ పరిస్థితి వేరుగా కనిపిస్తోంది. రుక్మిణి వసంత్ మాత్రం ఇప్పటికీ రిషబ్ శెట్టిని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతూనే ఉంది. అంతేకాకుండా ఆయన భార్య ప్రగతి శెట్టిని సైతం ఫాలో అవుతుండడంతో వీరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టమవుతోంది.

దాంతో ఇవన్నీ రూమర్స్ అని, ఇందులో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. ఇదిలా ఉండగా.. రిషబ్ శెట్టి పలు పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తెలుగులో జై హనుమాన్, హిందీలో ఛత్రపతి శివాజీ మహరాజ్ సినిమాలతో పాటు పలు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. ఆయా సినిమాలపై భారీ అంచనాలున్నాయి. మరో వైపు రుక్మిణి వసంత్ సైతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కన్నడ చిత్రాలతో పాటు ఇతర భాషల ప్రాజెక్టులపై కూడా దృష్టి సారించింది. యువతలో పెరుగుతున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం యశ్ హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్ మూవీతో పాటు తెలుగులో ఎన్టీఆర్-నీల్ కాంబోలో వస్తున్న మూవీలోని హీరోయిన్‌గా నటిస్తోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






