Real Star Srihari | రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి..!
Real Star Srihari | త్రినేత్ర న్యూస్ : రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. దివంగత నటుడు శ్రీహరి పెద్ద కుమారుడు శశాంక్ శ్రీహరి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు.
Real Star Srihari | త్రినేత్ర న్యూస్ : రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. దివంగత నటుడు శ్రీహరి పెద్ద కుమారుడు శశాంక్ శ్రీహరి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. సంజన అనే యువతితో ఏడు అడుగులు వేయనున్నట్లు తెలిసింది. ఈ జంట ఎంగేజ్మెంట్కు కూడా ముహుర్తం ఖరారైనట్లు సమాచారం. నిశ్చితార్థ వేడుకను 2027 ఫిబ్రవరి 20న నిర్వహించేందుకు ఇరు కుటుంబాల సభ్యులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. శ్రీహరి కుటుంబానికి సన్నిహితులైన స్నేహితుల కుటుంబానికి చెందిన అమ్మాయితోనే శశాంక్ వివాహం నిశ్చయమైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పెళ్లి తేదీకి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

శ్రీహరి, శాంతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శశాంక్ కాగా, చిన్న కుమారుడు మేఘాంశ్ శ్రీహరి. తండ్రి బాటలోనే మేఘాంశ్ నటుడిగా సినిమాల్లోకి వచ్చారు. ‘రాజ్‌దూత్’ సినిమాతో హీరోగా పరిచయమైన ఆయన విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు శశాంక్‌కు మాత్రం దర్శకత్వంపై ఆసక్తి ఉంది.
తాజావార్తలు
- ●BRS Party | 22న ఓరుగల్లులో బీఆర్ఎస్ బహిరంగ సభ..!
- ●Tenth Exam Fee | టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పది పరీక్షల ఫీజు గడువు పొడిగింపు
- ●Yadagirigutta | యాదగిరిగుట్టలో 20 నుంచి కార్తికోత్సవాలు
- ●Heavy Rain | 20న తెలంగాణలో అతి భారీ వర్షం..! జర జాగ్రత్త..!!
- ●Horoscope | నవంబర్ 17 రాశిఫలాలు.. ఈ రాశి వారు ఏ పని చేపట్టినా విజయం తథ్యం..!
- ●Telangana Employees JAC | తెలంగాణ ఉద్యోగుల జేఏసీ భేటీ: ఓపీఎస్ పునరుద్ధరణ, 2వ పీఆర్సీ అమలు సహా 41 ప్రధాన డిమాండ్లు ఇవే!

BRS Party | 22న ఓరుగల్లులో బీఆర్ఎస్ బహిరంగ సభ..!

Tenth Exam Fee | టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పది పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

Yadagirigutta | యాదగిరిగుట్టలో 20 నుంచి కార్తికోత్సవాలు

Heavy Rain | 20న తెలంగాణలో అతి భారీ వర్షం..! జర జాగ్రత్త..!!





