త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ranveer Singh | బాలీవుడ్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్‌కు క‌ర్నాట‌క హైకోర్టు షాక్‌..! ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..?

Ranveer Singh | బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌కు క‌ర్నాట‌క హైకోర్టు షాక్ ఇచ్చింది. త‌న‌పై న‌మోదైన క్రిమిన‌ల్ కేసును కొట్టివేయాలంటూ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను అత్య‌వ‌స‌రంగా విచారించేందుకు కోర్టు నిరాక‌రించింది.

P

Entertainment | Published On Feb 23, 2026, 7.06 pm IST

Ranveer Singh | బాలీవుడ్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్‌కు క‌ర్నాట‌క హైకోర్టు షాక్‌..! ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..?
Advertisement

Ranveer Singh | బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌కు క‌ర్నాట‌క హైకోర్టు షాక్ ఇచ్చింది. త‌న‌పై న‌మోదైన క్రిమిన‌ల్ కేసును కొట్టివేయాలంటూ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను అత్య‌వ‌స‌రంగా విచారించేందుకు కోర్టు నిరాక‌రించింది. కాంతారా చాప్ట‌ర్-1 చిత్రంలో ఓ స‌న్నివేశాన్ని కించ‌ప‌రిచేలా వ్యాఖ‌లు చేశార‌ని, హీరో రిష‌బ్‌ను వెక్కిరించార‌ని ర‌ణ్‌వీర్ సింగ్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. దాంతో ప‌లువురు ఆయ‌న‌పై బెంగళూరు హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మనోభావాలు, క‌ర్నాట‌క తీరప్రాంత చాముండి దైవ సంప్రదాయాన్ని కించ‌ప‌రిచార‌న్న ఆరోప‌ణ‌ల‌పై బీఎన్ఎస్‌లోని సెక్ష‌న్లు 196, 299, 302 కింద న్యాయ‌వాది ప్రశాంత్ మెథాల్ ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు కేసు న‌మోదు చేశారు.

ఈ కేసును కొట్టివేయాలంటూ ర‌ణ్‌వీర్ సింగ్ హైకోర్టు త‌లుపుత‌ట్టారు. జ‌స్టిస్ ఎం నాగ‌ప్ర‌స‌న్న నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఎదుట పిటిష‌న్‌ను ప్ర‌స్తావించారు. కేసును త‌క్ష‌ణం విచారించాల‌ని న‌టుడి త‌ర‌ఫు న్యాయ‌వాదులు కోర్టును కోరారు. అయితే, ధ‌ర్మాస‌నం బాలీవుడ్ న‌టుడి అభ్య‌ర్థ‌న‌ను తిర‌స్క‌రించింది. సెలెబ్రిటీ అయినంత మాత్రాన స్పెష‌ల్ ట్రీట్‌మెంట్ ఏమీ ఉండ‌ద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. పిటిష‌న‌ర్ బాలీవుడ్ స్టార్ అయినంత మాత్రాన ద‌ర్యాప్తును వేగ‌వంతం చేయాలా? హాలీవుడ్ న‌టుడైతే మ‌రింత త్వ‌ర‌గా చ‌ర్య‌లు తీసుకోవాలా? అంటూ ప్ర‌శ్నించారు. ఈ కేసును కోర్టు మంగ‌ళ‌వారం విచారించ‌నున్న‌ది.

గ‌తేడాది న‌వంబ‌ర్ 28న గోవాలో జ‌రిగిన ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ముగింపు వేడుక‌ల్లో ర‌ణ‌వీర్ పంజుర్లి, గుళిగ దేవుళ్ల హావ‌భావాల‌ను అస‌భ్యంగా, హాస్యాస్ప‌దంగా అనుక‌రించార‌ని పిటిష‌న‌ర్ ఆరోపించారు. చాముండి దైవాన్ని ఆడదెయ్యంగా బాలీవుడ్ న‌టుడు అభివ‌ర్ణించార‌న్నారు. చాముండి అమ్మవారిని కోస్టల్ క‌ర్నాట‌క ప్రాంత ప్ర‌జ‌లు నిత్యం పూజిస్తారని, దివ్య శక్తికి ప్రతీకగా భావిస్తారని ఆయ‌న తెలిపారు. ఈ చ‌ర్య‌లు భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీశాయ‌న్నారు. ప్రస్తుతం ఈ కేసు బెంగళూరులోని ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు విచారిస్తుంది. ఏప్రిల్ 8న మ‌ళ్లీ విచారించ‌నున్న‌ది. రిషబ్ షెట్టి నటనను తాను ప్ర‌శంసించేందుకు మాత్ర‌మే అలా చేశాన‌ని.. ఇందులో దురుద్దేశం ఏమీ లేద‌ని ర‌ణ‌వీర్ త‌ర‌ఫు న్యాయ‌వాదులు స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement