Dhurandhar | రణవీర్ సింగ్ (Ranveer Singh)హీరోగా నటించిన ధురంధర్ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఆరు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రెండు వందల కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. రణవీర్ సింగ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ధురంధర్ మూవీకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ ఆధిత్య ధర్ దర్శకత్వం వహించాడు. అక్షయ్ ఖన్నా, సంజయ్‌దత్ కీలక పాత్రలు పోషించారు. ధురంధర్ మూవీలో గూఢచారి పాత్రలో రణవీర్‌సింగ్ యాక్టింగ్ ఆధిత్య ధర్ టేకింగ్, ట్విస్ట్‌లు బాగున్నాయంటూ ఆడియెన్స్ నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా విలన్‌గా అక్షయ్ ఖన్నా అదరగొట్టాడని ఆడియెన్స్ చెబుతోన్నారు. ఇండియాలో కాసుల పంట పండిస్తున్న ధురంధర్ మూవీకి ఓవర్‌సీస్‌లో మాత్రం ఊహించని షాక్ తగిలింది. గల్ఫ్ కంట్రీస్ ఈ బాలీవుడ్ మూవీని బ్యాన్ చేశాయి. యాంటీ పాకిస్థాన్ మూవీగా పేర్కొంటూ యూఏఈ, ఖతర్, సౌదీ అరేబియాతో పాటు ఇతర గల్ఫ్ కంట్రీస్ ఈ సినిమాపై నిషేధం విధించాయి. ఓ వర్గం మనోభావాలను దెబ్బతీసేలా కథ కథనాలు ఉన్నాయనే సినిమాపై నిషేధం విధించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ బ్యాన్‌ను తీసేయాలని మేకర్స్ గల్ఫ్ కంట్రీస్‌ను కోరినట్లు సమాచారం. కానీ నిషేదం ఎత్తివేయడానికి ఆయా దేశాలు ఒప్పుకోలేదని ప్రచారం జరుగుతోంది. గల్ఫ్ కంట్రీస్‌లో బాలీవుడ్ సినిమాలు బ్యాన్‌ను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. పాకిస్థాన్ టెర్రరిజం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన హృతిక్ రోషన్ ఫైటర్‌తో పాటు మరికొన్ని సినిమాలు గల్ఫ్ కంట్రీస్‌లో రిలీజ్ కాలేదు. యాంటీ పాకిస్టాన్ ఎజెండాతో మేకర్స్ ఈ సినిమాలు చేయడమే ఇందుకు కారణమంటూ ప్రచారం జరిగింది. హృతిక్ రోషన్ ఫైటర్ మూవీని రీ ఎడిట్ చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రయత్నించారు. అయినా గల్ఫ్ దేశాల మాత్రం సినిమా రిలీజ్‌కు నో చెప్పాయి. తాజాగా ధురంధర్ కూడా వాయిదాపడటం బాలీవుడ్ వర్గాలను డిసపాయింట్ చేసింది. ఈ బ్యాన్ ఎఫెక్ట్‌తో ఓవర్‌సీస్ కలెక్షన్స్ భారీగానే తగ్గనున్నట్లు సమాచారం. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చేపట్టిన ఓ సీక్రెట్ ఆపరేషన్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది.