Rakul Preet Singh | ఆయనే నా లైఫ్‌లో సూపర్ హీరో.. రకుల్ భావోద్వేగ పోస్ట్..!
Rakul Preet Singh | తన రియల్ లైఫ్‌లో సూపర్ హీరో తండ్రేనని టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. తండ్రి పుట్టిన రోజు సందర్భంగా భావోద్వేగ పోస్ట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా స్పెషల్ వీడియోను అభిమానులతో పెంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఆ వీడియోలో చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు తండ్రితో గడిపిన మధుర క్షణాలను పంచుకుంది. కుటుంబంతో పంచుకున్న నవ్వులు, పుట్టినరోజు సంబరాలు, తదితర జ్ఞాపకాలన్నీ కలగలిసిన వీడియో అభిమానులను ఆకట్టుకుంది.
Pradeep Manthri
Entertainment | Invalid Date

Rakul Preet Singh | ఆయనే నా లైఫ్‌లో సూపర్ హీరో.. రకుల్ భావోద్వేగ పోస్ట్..! Rakul Preet Singh | తన రియల్ లైఫ్‌లో సూపర్ హీరో తండ్రేనని టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది.

తండ్రి పుట్టిన రోజు సందర్భంగా భావోద్వేగ పోస్ట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా స్పెషల్ వీడియోను అభిమానులతో పెంచుకుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఆ వీడియోలో చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు తండ్రితో గడిపిన మధుర క్షణాలను పంచుకుంది.

కుటుంబంతో పంచుకున్న నవ్వులు, పుట్టినరోజు సంబరాలు, తదితర జ్ఞాపకాలన్నీ కలగలిసిన వీడియో అభిమానులను ఆకట్టుకుంది.

‘నా జీవితంలో నిజమైన సూపర్ హీరోకు హ్యాపీ బర్త్‌డే. అపారమైన ప్రేమతో ముందుకు నడిపించే మీరే నాకు అండ. నాకు ఆయనే మార్గదర్శి’ అంటూ రకుల్ భావోద్వేగానికి గురయ్యారు.

తనలో ధైర్యం, పట్టుదల, నిస్వార్థ ప్రేమ, విలువలను నాటింది తండ్రేనని ఆమె స్పష్టంచేశారు.

‘పెద్ద కలలు కనడం నేర్పింది మీరే. ఎన్ని సవాళ్లు వచ్చినా నిలకడగా నిలబడడం ఎలా అనేది మీ నుంచే నేర్చుకున్నాను.

ప్రతిరోజూ చెప్పకపోయినా, మీరు నేర్పిన పాఠాలు నా ప్రతి అడుగులో ఉన్నాయి’ అని పేర్కొన్నారు.

‘ఇంకా ఎన్నో నవ్వులు, మరెన్నో జ్ఞాపకాలు, అమూల్యమైన మీ సలహాలు కావాలి. మాటల్లో చెప్పలేనంత ప్రేమ మీ కోసం’.. అంటూ ముగించింది.

రకుల్ సినిమాల విషయానికి వస్తే.. దే దే ప్యార్ దే-2 చిత్రంలో అజయ్ దేవగణ్, ఆర్ మాధవన్, గౌతమి కపూర్‌లతో కలిసి నటించింది.

ప్రస్తుతం పతీ పత్ని ఔర్ ఓహ్ దో మూవీలో నటిస్తుంది.

అయుష్మాన్ ఖురానా, సారా అలీఖాన్, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముదస్సర్ అజిజ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ మూవీలో ఈ నెల 15న విడుదల కానుంది. చివరగా మేరే హస్బెండ్ కి బీవీ మూవీలో నటించింది.

ఇందులో భూమి పడ్నేకర్, అర్జున్ కపూర్ కీలకపాత్రలు పోషించారు.

విడాకులు తీసుకున్న వ్యక్తి జీవతంలో ఓల్డ్ లవ్ స్టోరీ, మాజీ భార్య మళ్లీ ప్రవేశిస్తే ఎలా ఉంటుందని ఈ మూవీ స్టోరీ.


తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు


