త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

The Sourav Ganguly Story | దాదా పేరుతో గంగూలీ బ‌యోపిక్‌.. హీరోగా రాజ్‌కుమార్ రావు..!

The Sourav Ganguly Story | అంద‌రు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ దిగ్గ‌జం, టీమిండియా మాజీ సార‌థి సౌర‌వ్ గంగూలీ బ‌యోపిక్ తెర‌కెక్క‌బోతున్న‌ది. ఈ మూవీకి సంబంధించిన ప‌నులు వేగం పుంజుకున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ న‌టుడు రాజ్‌కుమార్ రావు సౌర‌వ్ పాత్ర‌లో న‌టించ‌నున్నారు.

P

Entertainment | Published On Apr 1, 2026, 6.53 pm IST

The Sourav Ganguly Story | దాదా పేరుతో గంగూలీ బ‌యోపిక్‌.. హీరోగా రాజ్‌కుమార్ రావు..!
Advertisement

The Sourav Ganguly Story | అంద‌రు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ దిగ్గ‌జం, టీమిండియా మాజీ సార‌థి సౌర‌వ్ గంగూలీ బ‌యోపిక్ తెర‌కెక్క‌బోతున్న‌ది. ఈ మూవీకి సంబంధించిన ప‌నులు వేగం పుంజుకున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ న‌టుడు రాజ్‌కుమార్ రావు సౌర‌వ్ పాత్ర‌లో న‌టించ‌నున్నారు. చాలాకాలంగా బ‌యోపిక్ గురించి వార్త‌లు వ‌స్తుండ‌గా.. తాజాగా ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్ల‌డం విశేషం. ఈ మూవీకి “దాదా – ది సౌరవ్ గంగూలీ స్టోరీ” అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ విష‌యాన్ని రాజ్‌కుమార్ రావు ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నాడు. “ఇదే ఆరంభం.. ది వన్ అండ్ ఓన్లీ #DADA” అంటూ ఆయన పోస్టు చేశారు. ఈ చిత్రాన్ని ల‌వ్ రంజ‌న్ నిర్మిస్తుండ‌గా.. విక్ర‌మాదిత్య మొత్వానే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వాస్త‌వానికి ఈ మూవీ చిత్రం ఇప్ప‌టికే మొద‌లుకావాల్సి ఉండ‌గా.. ప‌లు కార‌ణాల‌తో నిలిచిపోయింది.

 

View this post on Instagram

 

A post shared by RajKummar Rao (@rajkummar_rao)

ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగిన ఒక ఈవెంట్‌లో రాజ్‌కుమార్ రావు లుక్ అభిమానుల‌ను అంద‌రినీ గంద‌ర‌గోళౄనికి గురి చేసింది. బ‌రువు పెర‌గ‌డం, హెయిర్‌స్ట‌యిల్ మార్పుల నేప‌థ్యంలో ఆయ‌న ఆరోగ్యంపై సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే, వాటిపై స్పందించిన రాజ్‌కుమార్.. గంగూలీ పాత్ర కోసం ప్ర‌త్యేకంగా త‌న శ‌రీరాకృతిని మార్చుకున్న‌ట్లుగా తెలిపాడు. ఈ మూవీలో దాదా పాత్ర కోసం సుమారు తొమ్మిది నుంచి ప‌ది కిలోల వ‌ర‌కు బ‌రువు పెరిగాడు. ఇందుకు పిజ్జాలు, స్వీట్లు, అలూ ప‌రాఠాలు, బిర్యానీ త‌దిత‌ర ఇష్ట‌మైన ఫుడ్‌ని ఎక్కువ‌గా తీసుకున్న‌ట్లుగా తెలిపాడు. గ్లామ‌ర్‌ను ప‌క్క‌న‌పెట్టి పాత్రకు త‌గ్గ‌ట్లుగా త‌న‌ను తాను మార్చుకున్నాన‌ని చెప్పాడు. ప్రస్తుతం మళ్లీ బరువు తగ్గుతూ గంగూలీ లుక్‌లోకి మారేందుకు సిద్ధమవుతున్నట్లుగా వివ‌రించారు.

Advertisement
Advertisement