Raashii Khanna | ఆఫ్ స్క్రీనే కాదు.. ఆన్ స్క్రీన్‌లోనూ నిరాశే..!
Raashii Khanna | ఢిల్లీ బ్యూటీ రాశీఖన్నా ఇటీవల ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీ రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంది. ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లలో పాల్గొని.. మూవీపై అంచనాలు పెంచేందుకు ప్రయత్నించింది. ప్రమోషనల్ రీల్స్ చేయడంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
Entertainment | Published On Mar 25, 2026, 7.15 pm IST
Raashii Khanna | ఢిల్లీ బ్యూటీ రాశీఖన్నా ఇటీవల ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీ రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంది. ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లలో పాల్గొని.. మూవీపై అంచనాలు పెంచేందుకు ప్రయత్నించింది. ప్రమోషనల్ రీల్స్ చేయడంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ మూవీలో శ్రీలీల లీడ్ రోల్‌లో నటిస్తారని ప్రచారం జరిగింది. రాశీ ఖన్నా ప్రాజెక్ట్‌లో చేరడంతో ఆమె పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుందని భావించారు. అయితే సినిమా రిలీజ్ తర్వాత పరిస్థితి భిన్నంగా మారింది. రాశీ ఖన్నా పాత్ర కథలో కేవలం తొలి భాగానికే పరిమితమైంది.
ఆమె పాత్రకు న్యాయం జరుగలేదని, దాంతో అభిమానులు సైతం పెద్దగా కనెక్ట్ కాలేదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలాగే, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం విమర్శలకు దారితీసింది. కొందరు ప్రేక్షకులు ఆమె లుక్ ప్రభావవంతంగా లేదని వ్యాఖ్యానించారు. సినిమాలో పవన్ కల్యాణ్‌తో ‘కాలర్ ఎ ఎత్తారా’ సాంగ్‌లో కనిపించినా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. మూవీ రిలీజ్ తర్వాత ఈ పాటతో పాటు రోల్‌కు సినిమాకు ఏమాత్రం ఉపయోగపడలేదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సినిమా ద్వితీయార్థంలో ఆమె పాత్రకు అవకాశం ఉన్నా దర్శకుడు ఆ విషయంలో దృష్టి పెట్టలేదని, కథను సరిగా ఉపయోగించుకోకపోవడం వల్ల రాశీ పాత్ర ప్రభావం తగ్గిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదిలా ఉండగా.. రాశీ ఖన్నా ముందే ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్ కథను పూర్తిగా వినకుండానే అంగీకరించానని తెలిపారు. పెద్ద ప్రాజెక్ట్‌లో భాగమవడం సంతోషకరమైనప్పటికీ, ఈ సినిమా ఆమె కెరీర్‌కు ఆశించిన స్థాయిలో ఉపయోగపడలేదని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నారు. రాశీ ఇంతకు ముందు తెలుగులో తెలుసు కదా మూవీలో సిద్ధు జొన్నలగడ్డ మూవీలో నటించినా కెరీర్‌కు పెద్ద బ్రేక్ ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం రాశీ బాలీవుడ్‌తో పాటు తమిళ సినీ పరిశ్రమలో కూడా పలు ప్రాజెక్ట్‌లలో నటిస్తున్నారు. ప్రస్తుతం రాశీ చేతిలో తెలుగు సినిమాలు ఏమీ లేవు. తెలుగులో రాబోయే రోజుల్లో అవకాశాలు ఎలా వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫలితం ఆమె టాలీవుడ్ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో త్వరలోనే తేలనుంది. తమిళంలో రౌడీ అండ్ కోతో పాటు బాలీవుడ్‌లో మరో మూడు చిత్రాల్లో నటిస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



