త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raashi Khanna | అల్లు శిరీష్ పెళ్లికి రాశీఖన్నా – ఆ ఒక్క హీరోయిన్‌కే ఆహ్వానం – మెగా కోడ‌లు అంటూ పోస్ట్‌లు

అల్లు శిరీష్ పెళ్లి శుక్ర‌వారం జ‌రిగింది. ఈ పెళ్లి వేడుక‌లో మెగా ఫ్యామిలీతో పాటు మ‌రికొంత మంది క‌థానాయ‌కులు హాజ‌ర‌య్యారు. శిరీష్ పెళ్లిలో హీరోయిన్లు ఎవ‌రూ క‌నిపించ‌లేదు. కానీ రాశీఖ‌న్నా మాత్రం అటెండ్ కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రో మెగా కోడ‌లు అంటూ రాశీఖ‌న్నాను ఉద్దేశించి సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

a

Entertainment | Published On Mar 7, 2026, 4.34 pm IST

Raashi Khanna | అల్లు శిరీష్ పెళ్లికి రాశీఖన్నా  – ఆ ఒక్క హీరోయిన్‌కే ఆహ్వానం – మెగా కోడ‌లు అంటూ పోస్ట్‌లు
Advertisement

Raashi Khanna |టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ పెళ్లి శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ప్రియురాలు న‌య‌నిక రెడ్డి మెడ‌లో మూడుముళ్లు వేశాడు శిరీష్‌. వీరి పెళ్లి వేడుక‌కు కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు కొద్ది మంది సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. శిరీష్ పెళ్లికి మెగా హీరోలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. వీరితో పాటు వెంక‌టేష్, సూర్య‌, క‌ళ్యాణ్ రామ్‌తో పాటు మ‌రికొంత మంది హీరోలు ఈ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొన్నారు.

రాశీఖ‌న్నా మాత్ర‌మే...

హీరోయిన్ల నుంచి కేవ‌లం రాశీఖ‌న్నా మాత్ర‌మే శిరీష్ పెళ్లి వేడుక‌లో క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. కుటుంబ‌స‌భ్యులు అత్యంత స‌న్నిహితుల స‌మక్షంలోనే శిరీష్, న‌య‌నిక వివాహ తంతును నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు అల్లు ఫ్యామిలీ ప్ర‌క‌టించింది. ఈ స‌న్నిహితుల లిస్ట్‌లో రాశీఖ‌న్నా ఉండ‌టంపై సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల పుకార్లు షికారు చేస్తున్నాయి. రాశీఖ‌న్నా మ‌రో మెగా కోడ‌లు కానుందా అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. పెళ్లికి ముందు అల్లు శిరీష్‌, న‌య‌నిక రెడ్డి ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ పేరుతో నాలుగైదు పార్టీలు ఇచ్చారు. వాటికి మెగా యంగ్ హీరోల‌తో పాటు రాశీఖ‌న్నా అటెండ్ కాలేదు. పెళ్లికి మాత్రం మెగా హీరోలంద‌రూ వ‌చ్చారు. వారితో పాటు రాశీఖ‌న్నా కూడా క‌నిపించ‌డంతో రూమ‌ర్లు మొద‌ల‌య్యాయి.

రెండు సినిమాలు...

మెగా హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్‌, రాశీఖ‌న్నా ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తోన్నాయి. వీరిద్ద‌రు క‌లిసి సుప్రీమ్‌తో పాటు ప్ర‌తి రోజు పండ‌గే సినిమాల్లో న‌టించారు. ఈ సినిమాల షూటింగ్ స‌మ‌యంలోనే సాయిధ‌ర‌మ్‌తేజ్‌, రాశీఖ‌న్నా మ‌ధ్య మొద‌లైన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారిన‌ట్లు టాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపించాయి. ఈ రూమ‌ర్ల‌ను సాయిధ‌ర‌మ్‌తేజ్‌, రాశీఖ‌న్నా ఖండించారు. తాము మంచి స్నేహితులం మాత్ర‌మేనంటూ క్లారిటీ ఇచ్చారు. అయినా ఈ ప్రేమ వార్త‌ల‌కు మాత్రం పుల్‌స్టాప్ ప‌డ‌లేదు.తాజాగా శిరీష్ పెళ్లి వేడుక‌లో సాయిధ‌ర‌మ్‌తేజ్‌, రాశీఖ‌న్నా చాలా క్లోజ్‌గా క‌నిపించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి.

ఈ ఏడాదే పెళ్లి...

ఇటీవ‌లే తిరుమ‌ల‌ను ద‌ర్శించుకున్న స‌మ‌యంలో 2026లో తాను పెళ్లిచేసుకోబోతున్న‌ట్లు మెగా హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ ప్ర‌క‌టించారు. పెళ్లి కూతురు ఎవ‌ర‌న్న‌ది మాత్రం రివీల్ చేయ‌లేదు. దాంతో ఆ అమ్మాయి రాశీఖ‌న్నానే అని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతోన్నారు.ప్ర‌స్తుతం రాశీఖ‌న్నా తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌లో హీరోయిన్‌గా న‌టిస్తోంది. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా మార్చి 19న రిలీజ్ కాబోతుంది.

 

Advertisement
Advertisement