త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Likitha | హీరోయిన్‌గా రాను బొంబాయికి రాను డ్యాన్స‌ర్ – బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్‌తో రొమాన్స్‌

రాను నే బొంబాయికి రాను ఫోక్ సాంగ్‌లో న‌టించిన డ్యాన్స‌ర్ లిఖిత హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. సాV3 పేరుతో ఓ ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీ చేస్తోంది. ఈ సినిమాలో బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్ డీమోన్ ప‌వ‌న్ హీరోగా క‌నిపించ‌బోతున్నాడు.

N

Entertainment | Published On May 31, 2026, 5.58 pm IST

Likitha | హీరోయిన్‌గా రాను బొంబాయికి రాను డ్యాన్స‌ర్ – బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్‌తో రొమాన్స్‌
Advertisement

Likitha |  రాను నే బొంబాయికి రాను పాట‌తో ఫేమ‌స్ అయ్యింది ఫోక్ డ్యాన్స‌ర్ లిఖిత. యూట్యూబ్‌లో రిలీజైన ఈ పాట సెన్సేష‌న‌ల్ హిట్‌గా నిలిచింది. 850 మిలియ‌న్ల వ‌ర‌కు వ్యూస్‌ను సొంతం చేసుకుంది. రాను బొంబాయికి రాను పాట‌లో త‌న స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టిన లిఖిత హీరోయిన్‌గా మారింది. తెలుగులో ఓ సినిమా చేయ‌బోతుంది. సాV3 అనే డిఫ‌రెంట్ టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో బిగ్‌బాస్ 9 తెలుగు ర‌న్న‌ర‌ప్ డీమోన్ ప‌వ‌న్ హీరోగా న‌టిస్తోన్నాడు. సామ్రాట్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. కృష్ణ‌మాయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సాధార‌ణంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో సినిమా ప్రారంభ‌మ‌వుతుంది. ఆ త‌ర్వాత షూటింగ్ జ‌రుపుతారు. కానీ రొటీన్‌కు భిన్నంగా సాV3 షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు.

ఫోక్ సాంగ్స్‌కు బ్రేక్‌...

ఈ వేడుక‌లో లిఖిత మాట్లాడుతూ "హీరోయిన్ గా మంచి సినిమాలు చేయాలనే ఫోక్ సాంగ్స్ కు గ్యాప్ ఇచ్చాను. బెస్ట్ స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్న టైమ్ లో సాV3 మూవీ ఆఫర్ వచ్చింది. ఎలాంటి స్క్రిప్ట్ పేపర్ లేకుండా కథను ఓన్ చేసుకుని నటించాం" అని అన్న‌ది.

బిగ్‌బాస్ త‌ర్వాత‌...

హీరో డీమోన్ పవన్ మాట్లాడుతూ "బిగ్ బాస్ తర్వాత నేను ఎలాంటి మూవీ చేయాలని ఆలోచిస్తున్న టైమ్ లో డైరెక్టర్ కృష్ణ మాయ ఈ స్క్రిప్ట్ చెప్పారు. ఈ సినిమాతో నటుడిగా నాకు మంచి పేరొస్తుందని న‌మ్ముతున్నా. తక్కువ టైమ్ లో మంచి క్వాలిటీతో చేసిన మూవీ ఇది" అని చెప్పాడు..

సావిత్రి...

" సా అంటే సావిత్రి హీరోయిన్ పేరు. అలాగే వి అంటే విజయ్ కుమార్ ...3 అన‌గా త్రివిక్రమ్ రాజు.. మూడు పాత్ర‌ల ప్ర‌ధానంగా సినిమాకు సాV3 అనే టైటిల్ పెట్టాం. సినిమా షూటింగ్ , డబ్బింగ్ కంప్లీట్ చేసుకుని ఎడిటింగ్ చేస్తున్న టైమ్ లో పూజా కార్యక్రమాలు నిర్వ‌హించాం. ఇదొక వెరైటీ లిఖిత‌, డీమోన్ పవన్ కొత్త వాళ్లు ఎలా నటిస్తారో అనుకున్నాను గానీ పర్ ఫార్మెన్స్ ఇరగదీశారు" అని డైరెక్ట‌ర్ కృష్ణ మాయ పేర్కొన్నాడు.
సాV3 డైరెక్ట‌ర్ కృష్ణ మాయ గ‌తంలో యాక్ట‌ర్‌గా ప్ర‌భాస్ ఈశ్వ‌ర్‌తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో న‌టించాడు.

 

Advertisement
Advertisement