త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malavika Mohanan | నిర్మాత‌ల ఆలోచ‌న విధానం మారాలి : మాళ‌విక మోహ‌న‌న్‌

Malavika Mohanan | భార‌తీయ సినీ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌హిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలు త‌క్కువ‌నే చెప్పాలి. వారితో భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను తెర‌కెక్కించేందుకు నిర్మాత‌లు ఎవ‌రూ ముందుకురావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మ‌ల‌యాళీ బ్యూటీ మాళ‌విక మోహ‌న‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

P

Entertainment | Published On Jan 22, 2026, 1.20 pm IST

Malavika Mohanan | నిర్మాత‌ల ఆలోచ‌న విధానం మారాలి : మాళ‌విక మోహ‌న‌న్‌
Advertisement

Malavika Mohanan | భార‌తీయ సినీ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌హిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలు త‌క్కువ‌నే చెప్పాలి. వారితో భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను తెర‌కెక్కించేందుకు నిర్మాత‌లు ఎవ‌రూ ముందుకురావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మ‌ల‌యాళీ బ్యూటీ మాళ‌విక మోహ‌న‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. మ‌హిళా ప్ర‌ధాన చిత్రాల‌కు పెద్ద‌గా ఆద‌ర‌ణ ఉండ‌ద‌ని నిర్మాత‌ల‌తో పాటు న‌టీన‌టులు భావిస్తార‌ని తెలిపింది. అందుకే హీరోయిన్‌తో భారీ బ‌డ్జెట్ చిత్రాలు తీసేందుకు వెనుకాడుతార‌ని పేర్కొంది.

ఈ విష‌యంలో నిర్మాత‌ల ఆలోచ‌న విధానం మారాల‌ని మాళ‌విక అభిప్రాయం వ్య‌క్తం చేసింది. ఈ సంద‌ర్భంగా గ‌తేడాది విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ‘కొత్తలోక: చాప్టర్ 1’ని ప్ర‌స్తావించింది. ఈ మూవీ త‌క్కువ త‌క్కువ బ‌డ్జెట్‌తో తీసినా ఈ మూవీ మంచి సూప‌ర్ హిట్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. నిర్మాత‌ల ఆలోచ‌న‌ల‌కు ‘కొత్తలోక: చాప్టర్ 1’ గట్టి సమాధానం చెప్పిందన్నారు. క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ ఈ మూవీలో అద్భుతంగా న‌టించింద‌ని ప్ర‌శంసించింది. ఆమెపై న‌మ్మ‌కంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు ముందుకెళ్లార‌ని దాంతో మూవీ స‌క్సెస్ అయ్యింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. భారీ బ‌డ్జెట్ చిత్రాల్లో క‌థానాయిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో తీసుకునేందుకు నిర్మాత‌లు సాహ‌సించ‌డం లేద‌ని.. సాధార‌ణంగా ఇలాంటి చిత్రాల్లో హీరోలే ప్ర‌ధాన పోషిస్తార‌ని తెలిపింది.

‘కొత్తలోక: చాప్టర్ 1’ మూవీ డొమినిక్ అరుణ్ దర్శకత్వం వ‌హించ‌గా.. దుల్కర్ సల్మాన్ తన వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మలయాళ సూపర్ హీరో చిత్రంలో క‌ల్యాణి ప్రియదర్శన్ టైటిల్ పాత్రలో న‌టించింది. నస్లెన్, శాండీ, చందు సలీం కుమార్, అరుణ్ కురియన్ కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. ఈ మూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.303.86కోట్లు రాబ‌ట్టి ఆల్‌టైమ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఇదిలా ఉండ‌గా.. మాళ‌విక సినిమాల విష‌యానికి వ‌స్తే చివ‌ర‌గా.. 'ది రాజా సాబ్' చిత్రంలో కనిపించింది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఫాంటసీ హారర్ కామెడీ చిత్రం ప్రేక్షకులను మిక్స్‌డ్ టాక్‌తో న‌డుస్తున్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ రూ.200కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసింది. మాళ‌విక త‌ర్వాత స‌ర్దార్‌-2 మూవీలో క‌నిపించ‌నున్న‌ది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో కార్తి, రజిషా విజయన్ ప్రధాన పాత్ర‌ల్లో న‌టించ‌నున్నారు. ఎస్‌జే సూర్య‌, ఆషికా రంగ‌నాథ్ సైతం కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement