త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priyanka Chopra | ఏడేళ్ల త‌ర్వాత బాలీవుడ్ మూవీలో ప్రియాంక చోప్రా – వార‌ణాసి త‌ర్వాత నెక్స్ట్ ఇదే

మ‌హేష్‌బాబు హీరోగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న వార‌ణాసి మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తోంది ప్రియాంక చోప్రా. ఈ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే ప్రియాంక మ‌రో సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. హృతిక్ రోష‌న్‌తో ఓ సూప‌ర్ హీరో మూవీ చేయ‌బోతుంది.

N

Entertainment | Published On Feb 6, 2026, 3.39 pm IST

Priyanka Chopra | ఏడేళ్ల త‌ర్వాత బాలీవుడ్ మూవీలో ప్రియాంక చోప్రా – వార‌ణాసి త‌ర్వాత నెక్స్ట్ ఇదే
Advertisement

Priyanka Chopra |  బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొన‌సాగుతోన్న టైమ్‌లోనే హాలీవుడ్‌కు షిప్ట‌య్యింది గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా. పాప్ సింగ‌ర్ నిక్ జోన‌స్‌ను పెళ్లి చేసుకున్న ప్రియాంక గ‌త ఐదారేళ్లుగా హాలీవుడ్‌లోనే ఎక్కువ‌గా సినిమాలు చేస్తోంది. మ్యాట్రిక్ రిసారెక్ష‌న్స్‌, ది వైట్ టైగ‌ర్‌తో పాటు చాలానే సినిమా ఆఫ‌ర్లు ద‌క్కించుకుంది. ఆస్కార్‌, గోల్డెన్ గ్లోబ్‌తో ప‌లు అవార్డు వేడుక‌ల్లో గ్లామ‌ర్‌తో మెరిసిన ప్రియాంక పేరు హాలీవుడ్‌లోనే బాగానే వినిపించింది. ఎటొచ్చి స‌క్సెస్‌లు మాత్రం ద‌క్క‌లేదు. హాలీవుడ్‌లో అవ‌కాశాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో రాజ‌మౌళి వార‌ణాసితో తిరిగి ఇండియ‌న్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ పాన్ వ‌ర‌ల్డ్ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది.

క్రిష్ 4లో...

వార‌ణాసి సెట్స్‌పై ఉండ‌గానే ప్రియాంక చోప్రా మ‌రో బాలీవుడ్ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. హృతిక్ రోష‌న్ హీరోగా న‌టించిన క్రిష్ ఫ్రాంచైజ్ సినిమాలు బాలీవుడ్‌లో భారీగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాయి. ఈ సిరీస్‌లో ఇప్ప‌టివ‌ర‌కు మూడు సినిమాలు వ‌చ్చాయి. తాజాగా నాలుగో పార్ట్ రాబోతుంది. క్రిష్ 4 టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు హృతిక్ రోష‌న్ స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు.

2019 త‌ర్వాత‌...

క్రిష్ 4లో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ట‌. ఇటీవ‌లే మేక‌ర్స్ ప్రియాంక‌ను అప్రోచ్ అయిన‌ట్లు స‌మాచారం. బాలీవుడ్‌లో క‌మ్‌బ్యాక్‌ కోసం ఎదురుచూస్తున్న ప్రియాంక క‌థ విన‌కుండానే క్రిష్‌ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. 2019లో వ‌చ్చిన స్కై ఈజ్ పింక్ సినిమాతో చివ‌ర‌గా బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది ప్రియాంక చోప్రా. దాదాపు ఏడేళ్ల గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ క్రిష్ 4తో హిందీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్ట‌బోతుంది.

టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో...

క్రిష్, క్రిష్ 3 సినిమాల్లో హృతిక్ రోష‌న్‌కు జోడీగా ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా క‌నిపించింది. ప్రియ అనే పాత్ర చేసింది. క్రిష్‌లో హృతిక్ ప్రియురాలిగా, క్రిష్ 3లో భార్య‌గా క‌నిపించింది. క్రిష్ 4లో మాత్రంప్రియాంక రోల్ ఛాలెంజింగ్‌గా ఉంటుంద‌ని అంటున్నారు. గ‌త పార్ట్‌ల‌కు భిన్నంగా డిఫ‌రెంట్ షేడ్స్‌తో సాగుతుంద‌ని చెబుతున్నారు. టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో క్రిష్ 4 రూపొందుతోన్న‌ట్లు స‌మాచారం. కాలంలో వెన‌క్కి వెళ్లి చ‌రిత్ర‌ను మార్చాల‌నుకునే శ‌త్రువుల‌ను క్రిష్ ఎలా ఎదుర్కొన్నాడ‌నే పాయింట్‌తో ఈ మూవీ రూపొంద‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
కాగా వార‌ణాసి త‌ర్వాత ప్రియాంక చోప్రా న‌టించ‌నున్న సినిమా ఇదేన‌ని అంటున్నారు. బ్యాక్ టూ బ్యాక్ ఇండియ‌న్ సినిమాల‌కు అంగీక‌రిస్తుండ‌టంతో ఆమె హాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పిన‌ట్లే క‌నిపిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Advertisement
Advertisement