Preity Zinta | ఇంకా ఫేక్ వార్తలపై ప్రశ్నిస్తూనే ఉంటారు.. ప్రీతి జింటా ఆసక్తికర వ్యాఖ్యలు..!
Preity Zinta | బాలీవుడ్ నటి ప్రీతి జింటా సోషల్ మీడియా, పెయిడ్ పీఆర్, ఫేక్ న్యూస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అభిమానులతో నేరుగా మమేకం కావడానికే ప్రాధాన్యం ఇస్తానని, పెయిడ్ పీఆర్ తన స్టైల్ కాదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వేగంగా వ్యాపిస్తున్నాయని హెచ్చరించిన ఆమె, త్వరలో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించింది.
Entertainment | Published On Apr 28, 2026, 9.20 pm IST
Preity Zinta | బాలీవుడ్‌లో తరచుగా కనిపించని నటి ప్రీతి జింటా ప్రస్తుతం ఎక్కువగా ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో స్టేడియంలో లేదా తన జట్టు పంజాబ్ కింగ్స్‌తో కనిపిస్తోంది. తాజాగా ఐపీఎల్ మ్యాచ్‌ల నుంచి విరామం తీసుకున్న సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటిస్తూ పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. అందులో ముఖ్యంగా ‘పెయిడ్ పీఆర్’ అంశంపై స్పందించింది. ఒక అభిమాని “పీఆర్ టీమ్ సహాయం లేకుండా నేరుగా అభిమానులతో మాట్లాడటం వల్ల గాఢమైన అనుబంధం ఏర్పడుతోంది” అని ప్రశ్నించగా, దీనిపై ప్రీతి స్పందిస్తూ “ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడం కాస్త కష్టం. సోషల్ మీడియా మొత్తం వ్యవస్థనే మార్చేసింది. ఇది నాకు అభిమానులతో నేరుగా మాట్లాడే అవకాశం ఇస్తోంది. పెయిడ్ పీఆర్‌పై నాకు ఆసక్తి లేదు. సహజంగా ఏర్పడే ఈ అనుబంధం నాకు ముఖ్యమైంది” అని పేర్కొంది.
సోషల్ మీడియాకు మరోవైపు ప్రతికూలతలున్నాయని తెలిపింది. “ఇప్పుడు మొబైల్, కెమెరా ఉన్న ప్రతి ఒక్కరూ పాపరాజీగా మారుతున్నారు. ఒకవైపు ఎప్పుడూ ఫొటోలు తీస్తూనే ఉంటారు. మరోవైపు ఫాలోవర్లు, వ్యూస్, లైక్స్‌ను కొనుగోలు చేయడం కూడా జరుగుతోంది. సినిమా రంగంలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయని విన్నాను. ఇది కొందరికి వ్యాపారంగా మారింది. అయితే నేను ఎవరినీ విమర్శించను. కానీ అది నా స్టైల్ కాదు” అని స్పష్టం చేసింది. సోషల్ మీడియా ప్రభావంపై ప్రీతి ఆందోళన వ్యక్తం చేసింది. “సోషల్ మీడియా పాజిటివిటీ, నెగటివిటీ, ఫేక్ న్యూస్ అన్నింటినీ కొత్త స్థాయికి తీసుకెళ్లింది.
కొంతకాలం క్రితం నేను మహా కుంభమేళాకు వెళ్లినప్పుడు, నేను రూ.18 కోట్లు అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేదన్న తప్పుడు వార్తలు వచ్చాయి. ఎవరో ఒకరు రాసినది.. మరొకరు కాపీ చేయడంతో ఆ వార్త వేగంగా వ్యాపించింది. ఇది ఫేక్ అని ఎన్నిసార్లు చెప్పినా, ఇంకా కొందరు అదే విషయంపై ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వేగంగా వ్యాప్తిచెందడం పెద్ద ప్రమాదం. భవిష్యత్తులో అందరం జాగ్రత్తగా ఉండాలి” అని పేర్కొంది. ఇదిలా ఉండగా ప్రీతి జింటా త్వరలోనే మళ్లీ వెండితెరపై కనిపించనుంది. ఈ ఏడాదిలో రెండు చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపింది. అందులో ఎ చిత్రంలో సన్నీ డియోల్తో కలిసి నటిస్తోంది. ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 13న విడుదల కానుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



