త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajasaab OTT | రాజాసాబ్ స‌ర్‌ప్రైజ్ – ఓటీటీలో కొత్త సీన్ల‌తో ప్ర‌భాస్ హార‌ర్ మూవీ స్ట్రీమింగ్

ప్ర‌భాస్ హీరోగా న‌టించిన రాజాసాబ్ ఫిబ్ర‌వ‌రి 6 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఓటీటీ వెర్ష‌న్‌లో కొన్ని కొత్త సీన్ల‌ను యాడ్ చేయ‌బోతున్న‌ట్లు జియో హాట్ స్టార్ ప్ర‌క‌టించింది. ఎక్స్‌టెండెట్ క‌ట్ వెర్ష‌న్‌తో ఈ సినిమాను చూడొచ్చ‌ని ప్ర‌క‌టించింది.

N

Entertainment | Published On Feb 5, 2026, 2.35 pm IST

Rajasaab OTT | రాజాసాబ్ స‌ర్‌ప్రైజ్ – ఓటీటీలో కొత్త సీన్ల‌తో ప్ర‌భాస్ హార‌ర్ మూవీ స్ట్రీమింగ్
Advertisement

Rajasaab OTT | రాజాసాబ్ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు జియో హాట్‌స్టార్ గుడ్‌న్యూస్ వినిపించింది. ప్ర‌భాస్ హీరోగా న‌టించిన ఈ హార‌ర్ కామెడీ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. ఫిబ్ర‌వ‌రి 6 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే ఓటీటీ వెర్ష‌న్ కోసం కొన్ని కొత్త సీన్ల‌ను యాడ్ చేస్తున్నారు. ఈ విష‌యాన్ని జియో హాట్‌స్టార్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. ఎక్స్‌డెంటెట్ క‌ట్ వెర్ష‌న్‌తో ఈ సినిమాను చూడొచ్చ‌ని ప్ర‌క‌టించింది. ప్ర‌భాస్ ఓల్డ్ గెట‌ప్ సీన్ల‌తో పాటు ఓ సాంగ్‌ను, యోగిబాబు కామెడీ సీన్ల‌ను కూడా ఓటీటీ వెర్ష‌న్‌కు జోడించిన‌ట్లు స‌మాచారం. ఎక్స్‌ట్రా సీన్ల‌తో క‌లిసి దాదాపు మూడు గంట‌ల ప‌దిహేను నిమిషాల ర‌న్‌టైమ్‌తో రాజాసాబ్ ఓటీటీలోకి రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

షేక్ చేస్తుంద‌ని అనుకుంటే...

రాజాసాబ్‌ మూవీకి మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రిలీజ్‌కు ముందు సంక్రాంతి సినిమాల్లో రాజాసాబ్‌పైనే ఎక్కువ‌గా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ సినిమాతో ప్ర‌భాస్ పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేయ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు భావించారు. కానీ ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కార‌ణంగా రాజాసాబ్ బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా బోల్తా కొట్టింది. ప్ర‌భాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్స్‌లో ఒక‌టిగా నిలిచింది.
రాజాసాబ్‌లో నిధి అగ‌ర్వాల్‌, మాళ‌వికా మోహ‌న‌న్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా న‌టించారు. దాదాపు 450 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మాత టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ సినిమాను నిర్మించారు. థియేట‌ర్ల‌లో రెండు వంద‌ల కోట్ల‌లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి నిర్మాత‌ల‌కు భారీగా న‌ష్టాల‌ను మిగిల్చింది.

క‌న‌క‌రాజు కోసం అన్వేష‌ణ...

రాజాసాబ్ మూవీలో బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర‌లో న‌టించాడు. త‌మ‌న్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. త‌న తాత క‌న‌క‌రాజు కోసం అడ‌విలో ఉన్న ఓ పెద్ద ప్యాలెస్‌లో అడుగుపెట్టిన రాజాసాబ్‌కు అక్క‌డ ఎలాంటి అనూహ్య ప‌రిణామాలు ఎదుర‌య్యాయి. జ‌మీందారిణి అయిన అత‌డి నాన‌మ్మ గంగావ‌తి...సాధార‌ణ మ‌హిళ‌గా ఎందుకు జీవితాన్ని గ‌డుపుతుంది? రాజాసాబ్ లైఫ్‌లోకి వ‌చ్చిన భైర‌వి (మాళ‌వికా మోహ‌న‌న్‌), బ్లెస్సీ (నిధి అగ‌ర్వాల్‌), అనిత (రిద్ది కుమార్‌) ఎవ‌ర‌న్న‌దే ఈ మూవీ క‌థ‌.

Advertisement
Advertisement