త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nusrat Bharucha | నొప్పిలోనూ నవ్వులు పూయిస్తున్న నుస్రత్‌ భరూచా!

Nusrat Bharucha | బాధలోనూ చిరునవ్వు చెదరనివ్వకుండా ధైర్యంగా ముందుకు సాగుతున్న‌ది బాలీవుడ్‌ నటి నుస్రత్‌ భరూచా. ఇటీవల బాలి పర్యటనలో ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన ఆమె.. ప్రస్తుతం ముంబ‌యిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. ఈ ప్రమాదంలో వెన్నెముకకు ఫ్రాక్చర్‌ కావడంతో శస్త్రచికిత్స కూడా చేయించుకుంటున్న‌ది.

P

Entertainment | Published On Oct 12, 2026, 9.45 pm IST

Nusrat Bharucha | నొప్పిలోనూ నవ్వులు పూయిస్తున్న నుస్రత్‌ భరూచా!
Advertisement
  • బాలి ప్రమాదం తర్వాత ఆస్పత్రిలో చికిత్స..
  • షారుఖ్‌-కాజోల్‌ పాటతో మోముపై చిరునవ్వు..
  • నెమ్మదిగా కోలుకుంటున్నానంటూ పోస్ట్‌

Nusrat Bharucha | బాధలోనూ చిరునవ్వు చెదరనివ్వకుండా ధైర్యంగా ముందుకు సాగుతున్న‌ది బాలీవుడ్‌ నటి నుస్రత్‌ భరూచా. ఇటీవల బాలి పర్యటనలో ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన ఆమె.. ప్రస్తుతం ముంబ‌యిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. ఈ ప్రమాదంలో వెన్నెముకకు ఫ్రాక్చర్‌ కావడంతో శస్త్రచికిత్స కూడా చేయించుకుంటున్న‌ది. కష్టకాలంలోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా, తన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులతో అప్‌డేట్‌ పంచుకున్నారు.

ఆస్పత్రి బెడ్‌పై చికిత్స పొందుతున్న నుస్రత్‌.. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ వీడియోను షేర్‌ చేశారు. అందులో ఆస్పత్రి సిబ్బంది ఆమెకు ఆహారం అందిస్తుండగా.. నుస్రత్‌ టీవీ చూస్తూ కనిపించారు. అదే సమయంలో షారుఖ్‌ ఖాన్‌, కాజోల్‌ నటించిన ‘దిల్‌వాలే’ సినిమాలోని ‘రంగ్‌ దే తూ మోహే గెరువా’ పాట ప్రసారమవుతోంది. ఆ పాటను చూస్తూ ఆమె ముఖంపై చిరునవ్వు విరిసింది. ఈ వీడియోతో పాటు నుస్రత్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యను జోడించారు. ‘ఇలా షారుఖ్‌ ఖాన్‌, కాజోల్‌ నా ముఖంపై చిరునవ్వు తీసుకొచ్చారు. పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయనే విషయాన్ని గుర్తుచేశారు. నెమ్మదిగా అయినా సరే.. అన్నీ చక్కబడతాయి. నేను కూడా మెల్లమెల్లగా కోలుకుంటున్నా. ఎన్నో కలలు కంటున్నా’ అంటూ తన మనసులోని భావాలను పంచుకున్న‌ది. ఆమె పోస్ట్‌ అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది.

అంతకుముందు కూడా నుస్రత్‌ తన ఆరోగ్య పరిస్థితిపై ఆశావహంగా స్పందించారు. శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను షేర్‌ చేసిన ఆమె.. అందులో కనిపించిన ప్రత్యేక వైద్య కుర్చీ ద్వారా తన చికిత్సకు సంబంధించిన పరిస్థితిని అభిమానులతో పంచుకున్నారు. ‘అస్తమిస్తున్న సూర్యుడిని చూసి ఎప్పుడూ పరుగులు తీస్తూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నా దృక్పథం మారింది. అయినా.. పిక్చర్‌ అభీ బాకీ హై మేరే దోస్త్‌ (మిత్రమా.. అసలు కథ ఇంకా మిగిలే ఉంది)’ అంటూ స్ఫూర్తినిచ్చే క్యాప్షన్ ఇచ్చింది. కష్టకాలంలోనూ ఆశను వదులుకోకుండా ముందుకు సాగుతున్న నుస్రత్‌.. తన తాజా పోస్ట్‌తో అభిమానులకు ధైర్యం నింపుతోంది.

Nusrat Bharucha Post

Advertisement
Advertisement