త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nitin Movie | నితిన్ కొత్త సినిమా షూటింగ్ షురూ..!

Nitin Movie | హీరో నితిన్ కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంతో చిత్ర బృందం షూటింగ్‌కు శ్రీకారం చుట్టింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు నారి సిరిసవాడ, సోమశేఖర్ టీ దర్శకత్వం వహిస్తున్నారు.

P

Entertainment | Published On May 6, 2026, 2.34 pm IST

Nitin Movie | నితిన్ కొత్త సినిమా షూటింగ్ షురూ..!
Advertisement

Nitin Movie | హీరో నితిన్ కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంతో చిత్ర బృందం షూటింగ్‌కు శ్రీకారం చుట్టింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు నారి సిరిసవాడ, సోమశేఖర్ టీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ కాంబినేషన్ ప్రకటన వెలువడినప్పటి నుంచే సినీ వర్గాల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో నితిన్ కథానాయకుడిగా నటిస్తుండగా, రితికా నాయక్ కథానాయికగా క‌నిపించ‌నుంది. సంగీతాన్ని సురేష్ బొబ్బిలి అందిస్తుండగా.. ఈ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో పాటు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తోంది.

సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ సినిమాను సమర్పిస్తోంది. ఈ బ్యానర్ల కలయిక గతంలో వ‌చ్చిన చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మే రెండో వారం నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, షూటింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, కథాంశం మరియు ఇతర వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement