Nikki Tamboli | అది శక్తి కాదు.. పరికితనం..! బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిక్కీ తంబోలి..!
Nikki Tamboli | బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై తెలుగు బ్యూటీ నిక్కీ తంబోలి ఆగ్రహం వ్యక్తం చేసింది. రియాలిటీ షో ‘ది50’లో పాల్గొంటున్న నిక్కీ.. కో కంటెస్టెంట్ ప్రిన్స్ నరులాపై తీవ్ర విమర్శలు గుప్పించింది.
Entertainment | Published On Feb 14, 2026, 1.30 pm IST
Nikki Tamboli | బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై తెలుగు బ్యూటీ నిక్కీ తంబోలి ఆగ్రహం వ్యక్తం చేసింది. రియాలిటీ షో ‘ది50’లో పాల్గొంటున్న నిక్కీ.. కో కంటెస్టెంట్ ప్రిన్స్ నరులాపై తీవ్ర విమర్శలు గుప్పించింది. షోలో ప్రసారమైన ఒక ఎపిసోడ్‌లో తన శరారీకృతిపై వ్యాఖ్యలు చేశాడంటూ సోషల్ మీడియా వేదికగా వీడియో క్లిప్పింగ్‌ను పోస్ట్ పెట్టింది. ఇతరుల వెనుక వారి గురించి మాట్లాడడం శక్తి కాదు.. అది పిరికితనమని వ్యాఖ్యానించింది. ఎవరైనా మీ కూతురు శరీరాకృతి గురించి మాట్లాడితే ఇలాగే నవ్వుతారా? ఇది వ్యూహం కాదు.. ఆట కాదు.. నిశ్శబ్దంగా చేసే బాడీ షేమింగ్ అంటూ సోషల్ మీడియా పోస్ట్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కెమెరాలు వ్యక్తిత్వాన్ని మార్చవు. ఎదుట చెప్పలేని మాటలను వెనుక చెప్పడం బలం కాదు. బాధ్యతలేని ప్రభావం నాయకత్వం కాదు’ అంటూ ఘాటుగా స్పందించింది.
ప్రస్తుతం నిక్కీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆ తర్వాత నరులా టీమ్ నిక్కీ తంబోలిపై విమర్శలు గుప్పించింది. కేవలం సరదా ఆటపట్టించాడని.. ఎవరినీ బాధపెట్టడం, అవమానించడం దాని ఉద్దేశం కాదని స్పష్టం చేసింది. రియాలిటీ షోలలో వ్యక్తిగత వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ది 50 కార్యక్రమాన్ని బనిజయ్ ఆసియా నిర్మిస్తుండగా జియోహాట్‌స్టార్, కలర్స్ టీవీలు ప్రసారం చేస్తున్నాయి. ఈ భారీ రియాలిటీ షో, ఫ్రెంచ్ సిరీస్ లెస్ సింక్వాంటే ఆధారంగా రూపొందింది. షోలో 50 మంది పోటీపడుతారు.
నిక్కీ తంబోలి తన సినీ ప్రయాణాన్ని తెలుగు చిత్రం ‘చీకటి గదిలో చితక్కొటుడు’తో మొదలుపెట్టింది. ఆ తర్వాత తమిళ యాక్షన్ హారర్ మూవీ కాంచన 3లో నటించి అందరి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత తెలుగులో శ్రీవిష్ణు నటించిన ‘తిప్పరా మీసం’లో నటించింది. ఇటీవల హిందీలో పూర్తయిన ‘బిగ్ బాస్ 14’ సీజన్‌లో నిక్కీ తంబోలి రన్నరప్‌గా నిలిచింది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ ఫొటో షూట్స్‌తో ఫొటోలు అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇక ప్రిన్స్ నరులా ఎంటీవీ రోడీస్ 12, ఎంటీవీ స్ల్పిట్ విల్ల8, బిగ్‌బాస్9, నచ్ బలియే9 తదితర రియాలిటీల్లో పాల్గొని విజేతగా నిలిచాడు. అలాగే, బాదో బహు, నాగిన్ 3 సీరియల్స్‌లోనూ నటించాడు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



