Sarke Chunar Song | వివాదంలో సంజయ్ దత్-నోరా సర్కే చునార్ సాంగ్.. నోటీసులు జారీ చేసిన NHRC
Sarke Chunar Song | ఇటీవల విడుదలైన కేడీ- ది డెవిల్ మూవీలోని సర్కే చునార్ పాట వివాదంలో చిక్కుకుంది. సంజయ్‌దత్-నోరా ఫతేహీపై చిత్రీకరించిన ఆ పాటలో అనుచిత, ద్వందార్ధాలు ఉన్నాయంటూ జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) నోటీసు జారీ చేసింది.
Entertainment | Published On Mar 17, 2026, 11.26 am IST
Sarke Chunar Song | ఇటీవల విడుదలైన కేడీ- ది డెవిల్ మూవీలోని సర్కే చునార్ పాట వివాదంలో చిక్కుకుంది. సంజయ్‌దత్-నోరా ఫతేహీపై చిత్రీకరించిన ఆ పాటలో అనుచిత, ద్వందార్ధాలు ఉన్నాయంటూ జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) నోటీసు జారీ చేసింది. సోషల్ మీడియా వేదికగా పలువురు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సినీ విమర్శకులు సైతం సాంగ్‌లోని లిరిక్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. పదాలు అసభ్యంగా ఉన్నాయని, ఇది ఏమాత్రం సమర్థనీయం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. న్యాయవాది, సామాజిక కార్యకర్త వినీత్ జిందాల్ ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్‌లో ఫిర్యాదు చేశారు. పాటపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాటలో అసభ్య పదాలు ఉన్నాయని, వాటిని ఉపయోగించడంపై ఆయన అభ్యంతరం తెలిపారు.
పాటని సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ పాట అసభ్యతను ప్రోత్సహించేలా ఉందని, యువతపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ఇటీవల విడుదలైన ఈ పాటకు సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. పెద్ద సంఖ్యలో వీక్షకులు ద్వంద్వార్థాలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఈ పాటలోని డ్యాన్స్ హుక్ స్టెప్పులపై అభ్యంతరం తెలిపారు. . ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్ సైతం సోషల్ మీడియా వేదికగా వ్యతిరేకించారు. పాటలో నటించిన నోరా ఫతేజీ, సంజయ్ దత్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. అయితే, ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు మూవీ టీమ్ స్పందించలేదు. ‘సర్కే చునార్ తేరీ సర్కే’ సాంగ్ సాహిత్యాన్ని గీత రచయిత రకీబ్ ఆలం అందించగా.. సంగీతాన్ని అర్జున్ జన్య సమకూర్చారు. ఈ పాటను మంగ్లీ పాడడం విశేషం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



