త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kajal Aggarwal | నయనతార కాదు.. బాలకృష్ణ-గోపీచంద్‌ మూవీలో హీరోయిన్‌గా కాజల్‌ ఫిక్స్‌..!

Kajal Aggarwal | గాఢ్‌ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌పై ఇప్పటికే టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దాంతో ప్రస్తుతం రూపొందుతున్న ఎన్‌బీకే111 ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో క్రేజ్ మరింత పెరిగింది.

P

Entertainment | Published On Apr 21, 2026, 11.19 am IST

Kajal Aggarwal | నయనతార కాదు.. బాలకృష్ణ-గోపీచంద్‌ మూవీలో హీరోయిన్‌గా కాజల్‌ ఫిక్స్‌..!
Advertisement

Kajal Aggarwal | గాఢ్‌ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌పై ఇప్పటికే టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దాంతో ప్రస్తుతం రూపొందుతున్న ఎన్‌బీకే111 ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ నుంచి షూటింగ్ దశలోకి ఉంది. ఈ సినిమాను పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా, అదే సమయంలో భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కించేందుకు గోపీచంద్ మలినేని ప్లాన్‌ చేసినట్లుగా సమాచారం. బాలకృష్ణను ఇప్పటివరకు చూడని కొత్త లుక్‌లో చూపించేందుకు ప్రత్యేకంగా యాక్షన్ సీక్వెన్స్‌లు డిజైన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

విదేశీ స్టంట్ టీమ్ కూడా ఇందులో భాగమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఎంపిక విషయమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మొదట బాలకృష్ణకు జోడీగా నయనతారను తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే, కథలో జరిగిన మార్పులు, పాత్రల డిజైన్‌లో వచ్చిన కొత్త అప్‌డేట్స్ కారణంగా ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే ప్రచారం జరుగుతోంది. సమాచారం ప్రకారం.. డేట్స్ సర్దుబాటు కాకపోవడం కూడా కారణమనే వార్తలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ దీనిపై చిత్రబృందం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ గ్యాప్‌లోనే మరో కీలక పేరు తెరపైకి వచ్చింది. బాలకృష్ణకు జోడిగా కాజల్ అగర్వాల్‌ను ఫైనల్ చేసినట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే గోపీచంద్ మలినేని ఆమెతో చర్చలు పూర్తి చేసినట్లు, కథ, పాత్ర వివరాలు ఆమెకు నచ్చినట్లు ఇండస్ట్రీ టాక్.

గతంలో ‘భగవంత్ కేసరి’ సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించిన కాజల్, మళ్లీ అదే కాంబినేషన్‌లో కనిపించనుండటంతో అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా కథలో కీలక మలుపు తీసుకువచ్చే కీలక పాత్రని సమాచారం. అందుకే ఈ క్యాస్టింగ్ విషయంలో టీమ్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కాజల్ పేరు దాదాపు ఖరారైనట్టే కనిపిస్తున్నా.. నయనతార విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. ఆమె పూర్తిగా తప్పుకుందా? మరో పాత్ర కోసం చర్చలు జరుగుతున్నాయా అన్నది ఇంకా క్లారిటీ లేదు. మొత్తానికి ఎన్‌బీకే111 మూవీ హీరోయిన్ కాస్టింగ్ అంశం కొత్త ఉత్కంఠను రేపుతోంది. బాలకృష్ణ–గోపీచంద్ మలినేని కాంబినేషన్‌పై ఉన్న అంచనాలకు ఈ కొత్త అప్‌డేట్స్ మరింత హైప్ తీసుకొస్తున్నాయి. అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ సస్పెన్స్ కొనసాగనుంది.

Advertisement
Advertisement