Paradise Review | ప్యారడైజ్ మూవీ రివ్యూ – బానిసత్వంపై పోరాడే ఓ నాయకుడి కథ
గుర్తింపు అంటే కేవలం పేరు... మాత్రమే కాదు. అది ఓ జాతి చరిత్రకు, వారి కష్టానికి, ధైర్యానికి, పోరాటానికి ప్రతీక. అలాంటి గుర్తింపు కోసం పోరాడే ఓ నాయకుడి కథతో ప్యారడైజ్ మూవీ తెరకెక్కింది.
Entertainment | Published On Sep 24, 2026, 3.53 am IST
Paradise Review | తలవంచి బ్రతకడం బ్రతుకే కాదు.....ఆత్మగౌరవం లేని జీవితం శూన్యం....అని అన్నాడో కవి. తరచిచూస్తే గుర్తింపు, ఆత్మగౌరవం కోసం చరిత్రలో జరిగిన పోరాటాలు చాలానే కనిపిస్తాయి గుర్తింపు అంటే కేవలం పేరు... మాత్రమే కాదు. అది ఓ జాతి చరిత్రకు, వారి కష్టానికి, ధైర్యానికి, పోరాటానికి ప్రతీక. గుర్తింపు కోసం ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం అవసరమైతే ఆధిపత్యాన్ని, అన్యాయాన్నిప్రశ్నించాలి., అణిచివేతని అడ్డుకోవాలి.బానిసత్వం మీద బలహీనులు జెండా ఎగేరయాలి. కొన్నిసార్లు పెద్ద యుద్ధమే చేయాలని ప్యారడైజ్‌తో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చెప్పాడు. తరతరాలుగా బానిసత్వంతో బతుకుతోన్న ఓ జాతికి తల్లీకొడుకులు కలిసి ఎలా స్వేచ్ఛను తీసుకొచ్చారన్నది ఈ సినిమాలో చూపించాడు.
సమ్మక్క కథ...
సమ్మక్క (సోనాలి కులకర్ణి) సవారీ జాతికి చెందిన ఓ మహిళ. తన వాళ్లతో కలిసి ప్యారడైజ్ అనే ఏరియాలో బతుకుతుంటుంది. తమ జాతికి గుర్తింపు కావాలని చాలా ఏళ్లుగా పోరాటం చేస్తుంటుంది. కానీ తన అధికారబలంతో సమ్మక్క పోరాటాన్ని ఆదిలోనే అడ్డుకుంటుంటాడు శిఖంజా మాలిక్(మోహన్‌బాబు). సవారీ జాతిని బానిసల్లా చూస్తుంటాడు. తన అక్రమ సారా వ్యాపారం కోసం వారిని వాడుకుంటుంటాడు. తన జాతికి నాయకుడిగా కొడుకు జడల్ (నాని) ఉండాలని సమ్మక్క కలలు కంటుంది. శిఖంజా మాలిక్‌తో పాటు అతడి కొడుకు విక్రమ్ చేసిన అవమానం కారణంగా తల్లిపై ద్వేషం పెంచుకుంటాడు జడల్. ఓ హత్య చేసి జైలుపాలవుతాడు. పధ్నాలుగేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలై తన జాతివాళ్ల దగ్గరకు వస్తాడు జడల్. వచ్చిరావడంతోనే శిఖంజా మాలిక్ కొడుకు విక్రమ్‌తో గొడవకు దిగుతాడు. తండ్రి తర్వాత ప్యారడైజ్ ప్రపంచానికి రాజు కావాలని ఆశపడుతోన్న విక్రమ్‌ను దెబ్బకొడతాడు.
సవారీ జాతి నాయకుడు....
తన ఓటమిని ఒప్పుకోలేని విక్రమ్ సమ్మక్కను చంపాలని చూస్తాడు. తల్లి గొప్పతనం గురించి తెలుసుకున్న జడల్...విక్రమ్ బారి నుంచి తల్లిని కాపాడుకుంటాడు. సమ్మక్క కోరినట్లుగానే సవారీ జాతికి నాయకుడిగా మారతాడు.
మంచి మార్గంలో తన పోరాటం అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆయుధం పడతాడు జడల్. ప్యారడైజ్‌ను ప్రత్యేక ప్రాంతంగా ప్రకటిస్తాడు. అతడి ఎదుగుదలను ఓర్వలేని శిఖంజా మాలిక్ ఏం చేశాడు? జడల్‌పై తీవ్రవాదిగా ఎలా ముద్రవేశాడు? జడల్ జీవితంలోకి వచ్చిన సుబ్బలక్ష్మి (కయదు లోహర్) ఎవరు? తల్లి సమ్మక్క కోరినట్లుగానే సవారీ జాతికి జడల్ గుర్తింపును తీసుకొచ్చాడా? లేదా? అన్నదే ప్యారడైజ్‌లో మిగిలిన కథ.
అణిచివేత ..
ఆధిపత్యం....అణిచివేత ఎక్కడైతే ఉంటాయో... అక్కడ నుంచే వీరులు జన్మిస్తారు, తిరుగుబాటులు, పోరాటాలు మొదలవుతాయి. ఈ పాయింట్ నుంచే కథను రాసుకున్నారు డైరెక్టర్. బానిసలుగా బతుకుతున్న ఓ జాతి...తల్లి కారణంగా తనను వెంటాడుతోన్న ఓ అవమానం...ఓ సామాన్యుడిని ఎలా నాయకుడిగా మార్చింది అన్నది ఈ సినిమాలో ఆవిష్కరించాడు దర్శకుడు. కథానాయకుడి పోరాటాన్ని చాలా వయలెంట్‌గా చూపించాడు. హింస, రక్తపాత సన్నివేశాలు సినిమాలో చాలానే ఉన్నాయి. ఓ వైపు తల్లి కొడుకుల అనుబంధం, మరోవైపు తన జాతి కోసం హీరో చేసే పోరాటం రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చివరి వరకు సినిమాను ఉత్కంఠగా నడిపే ప్రయత్నం చేశారు. మధ్యలో లవ్‌స్టోరీ ఒక్కటే కాస్త పంటికిందరాయిలా తగులుతుంది. యూత్ ఆడియెన్స్ కోసమే కథలో ఆ ట్రాక్‌ను బలవంతంగా ఇరికించిన అనుభూతి కలుగుతుంది.
తెలంగాణ ఉద్యమం...
జడల్ తిరుగుబాటును తెలంగాణ ఉద్యమంతో పోల్చడం ప్యారడైజ్‌కు హైలైట్‌గా నిలిచింది. కేసీఆర్‌ను పోలిన ఓ పాత్రలో ప్రియదర్శి కనిపిస్తాడు. అతడు చెప్పే డైలాగ్స్, మ్యానరిజమ్స్ అచ్చం కేసీఆర్‌ను తలపిస్తాయి. బక్కాగా చిటికెనేలు లెక్క వున్నాడు ఈడెం జేస్తాడు అనుకుంటున్నావా....మాటిచ్చిండు అంటే సావు నోట్లో తలకాయ పెట్టయినా సాధిస్తాడు లాంటి డైలాగ్స్...తెలంగాణ ఉద్యమంతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి. కేసీఆర్ మాత్రమే కాకుండా చివరంలో సీనియర్ ఎన్టీఆర్‌ను పోలిన ఓ పాత్ర కూడా కనిపిస్తుంది.
ఇమజ్‌కు భిన్నంగా....
జడల్ పాత్రలో తన ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా కనిపించాడు. లుక్‌లో మాత్రమే కాదు..డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్ లో వేరియేషన్స్ చూపించాడు. దర్శకుడి విజన్‌ను నమ్మి సినిమా కోసం ఏం చేయాలో అవన్నీ చేశాడు. కయదు లోహర్ పాత్ర వ్యాంప్‌లా మొదలై...చివరకు సైడ్ క్యారెక్టర్‌లా ఎండ్ అయ్యింది. విలన్ పాత్రలో వింటేజ్ మోహన్‌బాబు కనిపించాడు. కానీ అతడి డైలాగ్స్‌లో మునుపటి ఫైర్ మాత్రం మిస్సయ్యింది. సమ్మక్క పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సోనాలి కులకర్ణి జీవించింది. తెలంగాణ డైలాగ్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. అనిరుధ్ కంపోజ్ చేసిన ఫోక్ సాంగ్స్ ఏషనాగుల, ఆయా షేర్ పాటలు మంచి ఊపునిచ్చాయి.ప్యారడైజ్ బానిసత్వంపై పోరాడే ఓ నాయకుడి కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
సెప్టెంబర్ 23, 2026

The Paradise | ‘ది ప్యారడైజ్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్.. రిలీజ్‌కు ముందే రూ.50 కోట్ల దిశగా!
సెప్టెంబర్ 23, 2026

Manasa Varanasi | తొలిసారిగా శర్వానంద్‌తో మానస వారణాసి రొమాన్స్..!
సెప్టెంబర్ 23, 2026
తాజావార్తలు
- ●DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ
- ●Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!
- ●Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్
- ●Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం
- ●Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా
- ●Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ

Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!

Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్

Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం



