త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

Aishwarya Lekshmi | సెలబ్రిటీలకు సోషల్‌ మీడియా ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానులతో టచ్‌లో ఉండటంతో పాటు సినిమాల ప్రమోషన్స్‌, బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్స్‌, కొత్త అవకాశాలకు ఇన్‌స్టాగ్రామ్‌ కీలక వేదికగా మారింది. ఇలాంటి సమయంలో ఆ వేదికకు దూరంగా ఉండటానికే మలయాళీ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి నిర్ణయించుకుంది.

P

Entertainment | Published On Sep 23, 2026, 8.05 pm IST

Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
Advertisement

Aishwarya Lekshmi | సెలబ్రిటీలకు సోషల్‌ మీడియా ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానులతో టచ్‌లో ఉండటంతో పాటు సినిమాల ప్రమోషన్స్‌, బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్స్‌, కొత్త అవకాశాలకు ఇన్‌స్టాగ్రామ్‌ కీలక వేదికగా మారింది. ఇలాంటి సమయంలో ఆ వేదికకు దూరంగా ఉండటానికే మలయాళీ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి నిర్ణయించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో లేకపోవడంతో ఆదాయం తగ్గొచ్చని తెలిసినా.. డబ్బు కంటే మానసిక ప్రశాంతతే తనకు ముఖ్యమని చెబుతున్నది. గతేడాది ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ను వీడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ ప్లాట్‌ఫామ్‌లో యాక్టివ్‌గా లేదు. సాధారణంగా సెలబ్రిటీలు సోషల్‌ మీడియా నుంచి కొంతకాలం బ్రేక్‌ తీసుకుని తిరిగి వస్తుంటారు. కానీ, ఐశ్వర్య లక్ష్మి మాత్రం ఏడాది గడిచినా మళ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన నిర్ణయానికి గల కారణాన్ని ఆమె వివరించింది.

ఆదాయం తగ్గుతుందని చెప్పినా..

ఇన్‌స్టాగ్రామ్‌లోకి తిరిగి రావాలని తన పీఆర్‌ టీమ్‌, మేనేజర్లు సూచించినట్లు ఐశ్వర్య లక్ష్మి వెల్లడించింది. సోషల్‌ మీడియాకు దూరంగా ఉండడంతో తనకు వచ్చే ఆదాయం తగ్గే అవకాశం ఉందని వారు చెప్పినట్లు తెలిపారు. సెలబ్రిటీలు ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండడంతో బ్రాండ్‌ డీల్స్‌, ప్రమోషనల్‌ అవకాశాలు పెరుగుతాయని.. ఆ కోణంలో చూసినా తిరిగి రావడం మంచిదని తన టీమ్‌ భావించినట్లు తెలుస్తోంది. అయితే, తనకు మాత్రం ఈ విషయంలో మరో ఆలోచన ఉందని ఐశ్వర్య లక్ష్మి చెబుతుంటారు. ఆదాయం తగ్గినా పర్వాలేదని, తన మానసిక ప్రశాంతతను మాత్రం వదులుకోవడానికి సిద్ధంగా లేనని ఆమె స్పష్టం చేసింది. ‘ఇటీవల నా పీఆర్‌ టీమ్‌, మేనేజర్లు మళ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లోకి రావాలని కోరారు. నా ఆదాయం తగ్గుతుందని చెప్పారు. కానీ, నేను డబ్బు కంటే మానసిక ప్రశాంతతకే ప్రాధాన్యం ఇచ్చాను’ అని ఆమె పేర్కొన్నారు.

ట్రోలింగ్‌తో ఒత్తిడి..

ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న సమయంలో ఎదురైన అనుభవాలను కూడా ఐశ్వర్య లక్ష్మి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నది. కొన్ని విషపూరితమైన మెసేజ్‌లు, అర్థం లేని ట్రోలింగ్‌ తనను ఒత్తిడికి గురిచేసేవని తెలిపింది. సోషల్‌ మీడియాలో కనిపించే ప్రతి కామెంట్‌ను పట్టించుకోకూడదని తెలిసినా.. కొన్ని సందర్భాల్లో అవి మానసికంగా ప్రభావం చూపించేవని ఆమె చెప్పింది. ‘నేను ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తప్పుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా, కామ్‌గా ఉంటున్నాను. గతంలో కొన్ని విషపూరితమైన మెసేజ్‌లు, అర్థం లేని ట్రోలింగ్‌ చూసి ఒత్తిడికి గురయ్యేదాన్ని’ అని ఐశ్వర్య లక్ష్మి పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌కు దూరమైన తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పును ఆమె సానుకూలంగా చూస్తోంది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఏం జరుగుతోంది? ఎవరు ఏం కామెంట్‌ చేశారు? తన గురించి ఎలాంటి చర్చ నడుస్తోంది? వంటి విషయాలను నిరంతరం గమనించాల్సిన అవసరం లేకపోవడంతో మరింత ప్రశాంతంగా ఉండగలుగుతున్నానని ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది.

మళ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లోకి వస్తారా?

ప్రస్తుతం అయితే అలాంటి ఆలోచన తనకు లేదని ఐశ్వర్య లక్ష్మి స్పష్టం చేసింది. పీఆర్‌ టీమ్‌, మేనేజర్ల నుంచి తిరిగి రావాలనే సూచనలు చేసినా.. తన నిర్ణయాన్ని మార్చుకోలేదని తెలిపింది. ఆదాయపరంగా కొంత నష్టం వచ్చినా.. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడమే తనకు ముఖ్యమని ఆమె చెబుతున్నది. సెలబ్రిటీలు తమ సినిమాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సోషల్‌ మీడియాలో పంచుకోవడం సాధారణంగా మారిపోయిన నేపథ్యంలో ఐశ్వర్య లక్ష్మి తీసుకున్న ఈ నిర్ణయం భిన్నంగా కనిపిస్తోంది. అయితే, సోషల్‌ మీడియాకు దూరంగా ఉండటమే కాకుండా.. తన సినిమాల విషయంలో మాత్రం ఆమె వరుసగా ముందుకు సాగుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఐశ్వర్య లక్ష్మి ప్రస్తుతం సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న ‘సంబరాల ఏటి గట్టు’ (SYG)లో లీడ్‌ రోల్‌లో కనిపించనుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది. సంక్రాంతి 2027 సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
Advertisement