Naga Chaitanya | నాగ చైతన్య కొత్త లవ్ స్టోరీ.. జోడీగా కన్నడ బ్యూటీ రుక్మిణి..!
Naga Chaitanya | అక్కినేని నాగచైతన్య సినిమాల్లో ఎప్పుడూ కొత్తదనం చూపించేందుకు ప్రయత్నిస్తుంటాడు. వరుసగా విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. తాజాగా మళ్లీ లవ్‌స్టోరీ ప్రేమకథ వైపు అడుగులు వేస్తున్నట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.
Entertainment | Published On Feb 17, 2026, 9.54 am IST
Naga Chaitanya | అక్కినేని నాగచైతన్య సినిమాల్లో ఎప్పుడూ కొత్తదనం చూపించేందుకు ప్రయత్నిస్తుంటాడు. వరుసగా విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. తాజాగా మళ్లీ లవ్‌స్టోరీ ప్రేమకథ వైపు అడుగులు వేస్తున్నట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. భారీ స్థాయి ప్రాజెక్ట్ ‘తండేల్’ తర్వాత చైతన్య మరోసారి రొమాంటిక్ జానర్‌ను ఎంచుకున్నాడనే వార్త అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ మూవీలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. సప్తసాగరాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి కాంతారా మూవీతో మరింత మంది అభిమానులను సంపాదించుకున్నది. తాజాగా ఈ ప్రాజెక్ట్ ద్వారా నేరుగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ జంట తెరపై కొత్తదనాన్ని తీసుకురావడమే కాకుండా.. వీరిద్దరి మధ్య సాగే భావోద్వేగాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయనే ప్రచారం జరుగుతోంది. ఈ మూవీకి బెదురులంక మూవీ డైరెక్టర్ క్లాక్స్ తెరకెక్కించనున్నారు. తొలి చిత్రంతోనే భిన్నమైన కథను అందించిన ఈ దర్శకుడు.. చైతు కోసం మ్యూజిక్, ప్రేమ, భావోద్వేగాల సమ్మేళనంగా ఉండే కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా చైతు పాత్రను సరదాగా తీర్చిదిద్దినట్లు సమాచారం. ఇక మరోవైపు, చైతన్య ఇప్పటికే విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కిస్తున్న ‘వృషకర్మ’ అనే పీరియడ్ డ్రామాలో నటిస్తున్నాడు. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న చైతుకు ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ మంచి మార్పు తీసుకువస్తుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






