త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mrunal Thakur | ల‌వ్ విష‌యంలో తొంద‌ర‌ప‌డొద్దు..! యువ‌త‌కు మృణాల్ అడ్వైజ్‌..!

Mrunal Thakur | సీతారామం బ్యూటీ మృణాల్ ఠాగూర్ ప్రేమికుల‌కు అడ్వైజ్ ఇచ్చింది. కొత్త చిత్రం దో దీవానే షెహ‌ర్ మే మూవీ రిలీజ్ విడుద‌ల కానున్న నేప‌థ్యంలో మూవీ ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్న‌ది. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ప్రేమ‌ను నిల‌బెట్టుకునేందుకు చాలా స‌హ‌నం, ఓపిక అవ‌స‌ర‌మ‌ని తెలిపింది.

P

Entertainment | Published On Feb 20, 2026, 9.20 am IST

Mrunal Thakur | ల‌వ్ విష‌యంలో తొంద‌ర‌ప‌డొద్దు..! యువ‌త‌కు మృణాల్ అడ్వైజ్‌..!
Advertisement

Mrunal Thakur | సీతారామం బ్యూటీ మృణాల్ ఠాగూర్ ప్రేమికుల‌కు అడ్వైజ్ ఇచ్చింది. కొత్త చిత్రం దో దీవానే షెహ‌ర్ మే మూవీ రిలీజ్ విడుద‌ల కానున్న నేప‌థ్యంలో మూవీ ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్న‌ది. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ప్రేమ‌ను నిల‌బెట్టుకునేందుకు చాలా స‌హ‌నం, ఓపిక అవ‌స‌ర‌మ‌ని తెలిపింది. ఈ డిజిట‌ల్ యుగంలో చిన్న చిన్న విష‌యాల‌కే సంబంధాల‌ను వ‌దిలేసుకుంటున్న ప‌రిస్థితి ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేసింది. “ఇప్పటి పరిస్థితులను చూడండి. ఎన్నో ఆప్ష‌న్స్ ఉండ‌డం వ‌ల్ల‌నే మనం ఒకరినొకరు సులభంగా వదిలేస్తున్నాం. మా సినిమాలోని శశాంక్, రోష్ని పాత్రలు ఈ కాలంలో పుట్టినా.. పాత తరహా ఆలోచ‌న‌ల్లోనే ఉంటారు. చిన్న గొడవ వచ్చినా ఒకరినొకరు బ్లాక్ చేయడం వంటి పనులు వారు చేయరు” అని మృణాల్ పేర్కొంది.

చిన్న చిన్న విష‌యాల‌కే మ‌న దారులు వేరు.. మ‌నం ఒక‌రికొక‌రం సెట్ కాము, మ‌న‌కు ఏమాత్రం క‌లిసిరాదు అని చెప్పే సంబంధాల‌ను వ‌దిలేసుకుంటున్నామ‌ని పేర్కొంది. ఇదంతా సుల‌భంగానే జ‌రుగుతోంద‌ని.. కానీ, ప్రేమ నిజ‌మైంద‌ని.. అంద‌మైన, అద్భుత‌మైన అనుభూతి అని.. స‌రైన వ్య‌క్తి మీ జీవితంలోకి వ‌చ్చిన స‌మ‌యంలో అది సుల‌భంగా మారిపోతుంద‌ని చెప్పింది. అందుకే ఎవ‌రూ తొంద‌ర‌ప‌డ‌కూడ‌ద‌ని, స‌హ‌నంగా ఉండాల‌ని యువ‌త‌కు సూచించింది. దో దీవానే షెహ‌ర్ మే చిత్రంలో సిద్ధాంత్ చ‌తుర్వేది, సందీపా ధ‌ర్‌, ఆయేషా ర‌జా, మృణాల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. జీ స్టూడియోస్‌, భ‌న్సాలీ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మాణంలో సంజయ్ లీలా భన్సాలి, ప్రేరణ సింగ్, ఉమేష్ కుమార్ బన్సల్, భారత్ కుమార్ సహకారంతో ఈ మూవీని తెర‌కెక్కించింది. ఈ మూవీ శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 20) విడుద‌ల కానున్న‌ది. ఇక మృణాల్ తెలుగులోనూ డెకాయిట్ మూవీలో న‌టిస్తోంది.

Advertisement
Advertisement