Mrunal Thakur | ఈ రోజుల్లో అదే పెద్ద సవాల్.. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్..!
Mrunal Thakur | ప్రేమ అనేది ఎప్పటికీ మారని భావోద్వేగమే అయినా, ఆధునిక కాలంలో దానికి ఎదురవుతున్న అతిపెద్ద సవాలు కమ్యూనికేషన్ అని సీతారామం ఫేమ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం మృణాల్ బాలీవుడ్‌లో ‘దో దీవానే శెహర్ మేన్’ విడుదలకు సిద్ధమవుతున్నది.
Entertainment | Published On Feb 18, 2026, 11.45 am IST
Mrunal Thakur | ప్రేమ అనేది ఎప్పటికీ మారని భావోద్వేగమే అయినా, ఆధునిక కాలంలో దానికి ఎదురవుతున్న అతిపెద్ద సవాలు కమ్యూనికేషన్ అని సీతారామం ఫేమ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం మృణాల్ బాలీవుడ్‌లో ‘దో దీవానే శెహర్ మేన్’ విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఈ రోజుల్లో ప్రేమలో ప్రధాన సమస్య కమ్యూనికేషన్. నటిగా పని చేయడం మరింత కష్టం. ఎందుకంటే కొన్నిసార్లు నేను ఒక పాత్రలో ఉంటే ఆ పాత్ర కోసం ఒక ప్రత్యేక మానసిక స్థితిలో ఉండాలి. ఆ స్థితి సానుకూలం కాకపోవచ్చు. దాంతో నా వ్యక్తిగత జీవితంలో, నా భాగస్వామితో, కుటుంబంత, స్నేహితులతో నా ప్రవర్తనపై ప్రభావం చూపవచ్చు.
కానీ, నటిగా నేను నా పాత్రల ప్రభావాన్ని ఇంటికి తీసుకురాకుండా చూసుకుంటాను. ఆ పాత్రలను ఇంటికి తీసుకురాకుండా చూసే ప్రయత్నం చేస్తాను’ అని పేర్కొంది. కమ్యూనికేషన్ ఒకవైపు అనుకూలం అయితే.. మరోవైపు ప్రతికూల ప్రభావాలు కూడా ఉన్నాయని మృణాల్ తెలిపింది. ‘ఒకసారి అభిమన్యు దాసాని తల్లి, మాజీ బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీతో మంచి సమయం గడిపాను. ఆమె తన లవ్‌స్టోరీని మాతో పంచుకున్నారు. ఆ రోజుల్లో ఒక కాల్ కోసం వారానికి ఒకసారి ఎదురు చూసేవారట. పీసీవో వద్ద, సిగ్నల్ రాని ప్రదేశంలో కూడా ఆ కాల్ కోసం వేచి ఉండేవారట. ఆ కాల్‌కు, ఆ సమయానికి ఉన్న విలువ ఎంతో ప్రత్యేకం. ఇప్పుడు మాత్రం మాట్లాడటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అదే సమయంలో ఆ సరళమైన ప్రేమ కొంత బలహీనపడినట్టుగా అనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించింది. ప్రస్తుత కాలంలో ఆప్షన్స్ ఎక్కువగా ఉండడం కూడా సంబంధాలపై ప్రభావం చూపుతోందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
అంతులేని అవకాశాలు, నిరంతర కమ్యూనికేషన్ మధ్య భావోద్వేగాలకు ఉన్న ప్రాధాన్యం తగ్గుతోందని అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా.. మృణాల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘దో దీవానే శెహర్ మేన్’ చిత్రంలో నటిస్తుంది. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది, సందీపా ధర్, ఆయేషా రాజా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియోస్, భన్సాలీ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ, ప్రేరణ సింగ్, ఉమేశ్ కుమార్ బన్సాల్, భారత్ కుమార్ రంగా నిర్మాతలుగా వ్యవహరించారు. రవి ఉద్యావర్ ఫిల్మ్స్ సహకారంతో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 20న విడుదల కానున్నది. మృణాల్ తెలుగులో అడవిశేష్ హీరోగా తెరకెక్కుతున్న డెకాయిట్ మూవీలోనూ కనిపించనున్నది.
సంబంధిత వార్తలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
మే 21, 2026

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
మే 21, 2026

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



