త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mrunal Thakur | మృణాల్‌ కోరిక నెరవేరబోతుందిగా..! ఎట్టకేలకు కోలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌..!

Mrunal Thakur | ఎన్నో అంచనాల మధ్య ఈ ఏడాది రిలీజ్‌ అయిన థగ్‌లైఫ్‌ మూవీ బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ రిజల్ట్‌తో నిరాశలో ఉన్న హీరో సిలంబరసన్ (Silambarasan TR) దాని నుంచి బయటపడి.. ప్రస్తుతం పలు ప్రాజెక్టులపై దృష్టి పెట్టాడు. ప్రస్తుతం దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న ‘అరసన్’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇదే సమయంలో దర్శకుడు అశ్వత్ మారిముత్తుతో మరో ప్రాజెక్టును లైన్‌లో పెడుతున్నాడు.

P

Entertainment | Published On Mar 3, 2026, 10.30 am IST

Mrunal Thakur | మృణాల్‌ కోరిక నెరవేరబోతుందిగా..! ఎట్టకేలకు కోలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌..!
Advertisement

Mrunal Thakur | ఎన్నో అంచనాల మధ్య ఈ ఏడాది రిలీజ్‌ అయిన థగ్‌లైఫ్‌ మూవీ బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ రిజల్ట్‌తో నిరాశలో ఉన్న హీరో సిలంబరసన్ (Silambarasan TR) దాని నుంచి బయటపడి.. ప్రస్తుతం పలు ప్రాజెక్టులపై దృష్టి పెట్టాడు. ప్రస్తుతం దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న ‘అరసన్’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇదే సమయంలో దర్శకుడు అశ్వత్ మారిముత్తుతో మరో ప్రాజెక్టును లైన్‌లో పెడుతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి.

తాజా బజ్‌ ప్రకారం.. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్‌ను తీసుకోవాలని అశ్వత్ మారిముత్తు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కీలక పాత్ర కోసం నటుడు సంతానం‌తో కూడా చర్చలు జరుగుతున్నాయని కోలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. అధికారిక ప్రకటన రాకముందే ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మృణాల్ ఠాకూర్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. అది ఆమెకు కోలీవుడ్‌లో తొలి సినిమా కానున్నది. గతంలో పలుసార్లు తమిళ సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె కోరిక నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్‌పై పాజిటివ్ స్పందన కనిపిస్తోంది. అశ్వత్ మారిముత్తు సినిమాల్లో నటించిన రితికా సింగ్, కయాదు లోహర్‌లకు మంచి గుర్తింపు వచ్చిందని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.

మృణాల్‌కు మంచి పాత్ర దక్కితే కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు. ఇటీవల మృణాల్‌ నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా రాణించలేకపోయాయి. మార్కెట్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలంటే మంచి హిట్‌ అవసరమని ఇండస్ట్రీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాంటి సమయంలో కోలీవుడ్‌లో మంచి కథతో వస్తే ఈ బ్యూటీ కెరీర్‌కు కీలకంగా మారుతుందని చెబుతున్నారు. అయితే, మృణాల్‌ను హీరోయిన్‌గా తీసుకుంటారా అన్నదానిపై మేకర్స్‌ అఫీషియల్‌గా ప్రకటించాల్సి ఉంది. శింబు–అశ్వత్ మారిముత్తు కాంబినేషన్‌తోనే ఆమె కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. అభిమానులంతా అంతా ఎదురుచూస్తున్న ఈ అప్‌డేట్‌పై త్వరలోనే స్పష్టత రానుంది.

Advertisement
Advertisement